టేకులపల్లి, జనవరి 10: టేకులపల్లి మండలంలోని దాసుతండా పంచాయితీ మంగళతండా సమీపంలో 200 క్వింటాల అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాల విభాగం ఆధ్వర్యంలో శనివారం భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పేదలకు రేషన్ షాపుల ద్వారా అందాల్సిన బియ్యాన్ని కొందరు అక్రమంగా తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో మంగళ తండా గ్రామంలో సోదాలు చేశాం. ఈ క్రమంలో సుమారు 200 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నామని ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్ఐ జి వెంకటకృష్ణ, పౌరసరఫరాల ఆర్ఐ ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే.. ఈ బియ్యం ఎవరివి? ఎక్కడికి తరలిస్తున్నారు? వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.