మీ చర్మం నిగనిగ మెరవాలా.. అయితే మేక పాలు ట్రై చేయండి
Goat Milk | మేకపాల ఔషధ గుణాన్ని మన పెద్దలు ఎప్పుడో గుర్తించారు. ఆవుపాలతో పోలిస్తే అత్యవసర కొవ్వు ఆమ్లాలు మేకపాలలోనే ఎక్కువ. అదనంగా క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి కూడా ఉంటాయి.
♦ మేకపాలు సహజ మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి. పైగా చర్మంలోకి ఇంకిపోతాయి. అలా చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుతాయి.
♦ మనిషి చర్మంలో ఉండే పీహెచ్ స్థాయులే మేకపాలలో ఉంటాయి. అంటే మేకపాల వల్ల చర్మం తన సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోదన్నమాట!
♦ సోరియాసిస్, గజ్జి లాంటి చర్మవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
♦ మేకపాలలో లాక్టిక్ ఆమ్లం ఎక్కువ. ఈ కారణంగా చర్మం నెమ్మదిగా రాలిపోతుంది. చర్మంపై తేమ నిలిచిపోయేలా చేస్తుంది. పొడిబారిన చర్మానికి పోషణనిస్తాయి.
♦ మొటిమలు, మచ్చల చికిత్సకూ మేకపాలు దోహదపడతాయి. మేకపాలలోని ప్రొటీన్లలో యాంటి బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి.
♦ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్నందువల్ల చిటచిటను, మంటను తగ్గిస్తాయి.
♦ మేకపాలను నేరుగా చర్మంపై ఫేస్ మాస్కులా ఉపయోగించుకోవచ్చు. మాయిశ్చరైజింగ్ ఫేస్ క్రీములు, సబ్బుల్లో కలుపుకొని వాడుకోవచ్చు.
♦ నూటికో కోటికో ఒక్కరికి.. మేకపాలు పడకపోవచ్చు.
Read More :
“గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?”
“Milk | ఏ పాలు తాగితే మంచిది? ఆవుపాలా? బర్రెపాలా?”
“Milk | మీరు తాగే పాలు కల్తీ అయ్యాయని అనుమానమా ! ఈ చిట్కాతో తెలుసుకోండి
Dark Circles | కంటి కింద వలయాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- Goat
- Health
- milk
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

