Dark Circles under the Eyes | నిద్రలేమి, ఎండలు, పని ఒత్తిడి, పోషకాహార లోపం, తగినన్ని నీళ్లు తాగకపోవడం.. ఇలా కంటి కింద వలయాలకు ఎన్నో కారణాలు. వీటికి చెక్ పెట్టాలంటే..
♦ టీ, కాఫీ, గ్రీన్ టీ బ్యాగులు చక్కగా పనిచేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇరవై నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచిన టీ బ్యాగులను 15 నిమిషాలపాటు రెండు కళ్ల కిందా పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
♦ రెటినాల్‌తో తయారైన ఫేస్క్రీమ్ను వాడినా ఫలితం ఉంటుంది. వీటివల్ల చర్మంలోని కొలాజన్ స్థాయి పెరగడంతో వాపు, మంట తగ్గుతుంది. కాకపోతే, విటమిన్-ఎ మాత్రలు వేసుకునే వారు, గర్భిణులు ఈ క్రీములను వాడకపోవడమే మంచిది.
♦ రోజ్ వాటర్‌లో దూదిని ముంచి పది నిమిషాలపాటు కళ్లకింద సున్నితంగా అద్దినా కూడా మంచి ఫలితం ఉంటుంది. కీరా దోస, టమాట, బంగాళ దుంపలు, అలోవెరా కూడా నల్లటి వలయాల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
♦ ఎండలో బయటకెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉప్పు మోతాదు తగ్గిస్తే మంచిది. మద్యపానం, ధూమపానం దురలవాట్లు కూడా ఈ వలయాలకు ఒక కారణమే.
“ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతున్నారా? ఇది తెలిస్తే మళ్లీ ఆ పని చేయరు!!”
Mosquito Bites | దోమలు కొందరినే కుడతాయెందుకు? కారణం ఏమై ఉంటుంది?
పాదాలు అందంగా కనిపించాలా? అయితే గ్రీన్ టీతో ఇలా చేసి చూడండి”