పాదాలు అందంగా కనిపించాలా? అయితే గ్రీన్ టీతో ఇలా చేసి చూడండి
Green Tea Beauty Tips | ఆరోగ్యం విషయంలో గ్రీన్ టీతో ఎన్నో ప్రయోజనాలు. చర్మం నిగారింపును మెరుగు పరుస్తుంది. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. గాయాల నుంచి చర్మం కోలుకునేలా సహకరిస్తుంది. అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. ముడతలను, మంటను తగ్గిస్తుంది. పాదాలను సంరక్షించడంలోనూ దీని పాత్ర అమోఘమనే సంగతి మీకు తెలుసా? గ్రీన్ టీలో కాసేపు పాదాలను ఉంచితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పాదాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తాయి. ఈ ప్రయోజనం కోసం ఇలా చేయాలి…
♦ నాలుగు గ్రీన్ టీ సంచులను వేడినీళ్లలో ముంచాలి.
♦ టీ నీళ్లలో కలిసిపోయే లోపు కాళ్లను సబ్బుతో కడిగి శుభ్రం చేసుకోవాలి.
♦ నీళ్లు గోరువెచ్చగా అవగానే బకెట్లో కొంచెం సహజమైన మినరల్ బాత్ సాల్ట్ కలపాలి. గ్రీన్ టీకి బాత్ సాల్ట్ కలపడం వల్ల మరింత ఉపశమనం లభిస్తుంది.
♦ అలా పాదాలను 10 15 నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత ‘ప్యూమిస్ స్టోన్’తో బాగా రుద్దాలి. దాంతో చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.
♦ ఆ తర్వాత పాదాలను బాగా శుభ్రం చేసుకోవాలి. నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను రుద్దుకోవాలి. అలా సున్నితంగా మర్దన చేసుకుంటే పగుళ్ల నుంచి విముక్తి లభిస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం? గ్రీన్ టీతో పాదాల పగుళ్ల చికిత్సకు సిద్ధంకండి.
Read More
ముఖం అందంగా ఉంటే సరిపోతుందా.. పాదాలూ అందంగా ఉండాలిగా..!”
“Beauty Tips | అందమైన పెదవుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి”
“కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?”
“face sculpting | గూగుల్‌లో అత్యధికంగా వెతికింది దీని గురించే..”
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- green tea
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

