ముఖం అందంగా ఉంటే సరిపోతుందా.. పాదాలూ అందంగా ఉండాలిగా..!
Beauty tips for heels: చాలా మంది అందంగా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మెరిసే చర్మం కోసం ముఖానికి, ఒంటికి క్రీములు, లోషన్లు పూసుకుంటారు. హెయిర్ కటింగ్‌లో, వస్త్రధారణలో ప్రత్యేకతలకు

హైదరాబాద్: చాలా మంది అందంగా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మెరిసే చర్మం కోసం ముఖానికి, ఒంటికి క్రీములు, లోషన్లు పూసుకుంటారు. హెయిర్ కటింగ్‌లో, వస్త్రధారణలో ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తారు. కండ్లకు ఐ లైనర్లు, పెదాలకు లిప్‌స్టిక్‌లు ఇలా వేటికీ వెనక్కి తగ్గరు. కానీ పాదాల సంరక్షణను మాత్రం కొంతమంది గాలికి వదిలేస్తారు. కానీ, సుతిమెత్తగా ఉండాల్సిన పాదాల మడిమ భాగాలు పగుళ్లవల్ల అందవికారంగా తయారవుతాయి. అంతేగాక తీవ్రంగా బాధిస్తాయి కూడా. కాబట్టి కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దామా..?
పాదాల అందానికి చిట్కాలు..
- మౌత్‌వాష్ పౌడర్ చర్మానికి తేమను అందిస్తుంది. ఒక వెడల్పాటి బకెట్లో కొంచెం మౌత్‌వాష్ పౌడర్, నీళ్లు కలిపి అందులో పాదాలను 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత నీళ్లతో పాదాలను శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
- యాంటీ మైక్రోబయల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న తేనె కూడా పగిలిన పాదాలకు చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
- కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి తేమను అందించి తాజాగా మారుస్తుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు పాదాలకు కొబ్బరినూనె రాసుకుంటే పగుళ్ల బాధ తగ్గడమేగాక అందంగా ఉంటాయి.
- ఇక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మడిమలు పగులుతాయి. అప్పుడు వెనిగర్ కలిపిన నీటిలో పాదాలను కొద్దిసేపు ఉంచితే సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
- అంతేగాక పగిలిన పాదాలకు ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ప్రతివారం ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

