Cardmom Health benefits | యాలకుల ( Elaichi ) రేటెక్కువే. సువాసనకు, రుచికి మాత్రమే కాదు ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. రోజూ యాలకుల్ని తింటే కొన్ని ధీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి.
-యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి. చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి. వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం వంటి సమస్యలన్నింటికీ యాలకులు చెక్ పెడతాయి. జుట్టు ఒత్తుగా బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడుతాయి.
-యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ యాలకును తినాలి. శరీరంలోని వ్యర్థాలు, హానికర బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి.
-యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ సమస్యను పోగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి. పిల్లలకు తినిపించడం వల్ల వారి ఎముకలు గట్టిపడుతాయి.
-యాలకులు తినడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. అనేక మౌత్ ఫ్రెష్‌నర్‌లలో యాలకుల రసాన్ని కలుపుతారు. బాడీ డీహైడ్రేషన్ కాకుండా కూడా యాలకులు కాపాడుతాయి.
-యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం. యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే మంచిది.