Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Deeksha Divas | కేసీఆర్ జైల్లోనే తన ఆమరణ దీక్ష ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం పిలుపును అందుకున్న తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, కళాకారులు, కవులు, ఉద్యోగులు. రైతులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పార్సి రంగారావు గుర్తు చేశారు.
Deeksha Divas | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చుడో –కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో పోరాటానికి సిద్ధమయ్యారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పార్సి రంగారావు అన్నారు.
నవంబర్ 29 చారిత్రాత్మకమైన ఘట్టమైన దీక్ష దివస్‌ను ఉద్దేశించి పార్సి రంగారావు మాట్లాడుతూ.. సిద్దిపేట సమీపంలోని రంగధాంపల్లిలో దీక్ష చేయడానికి కరీంనగర్ నుండి వస్తుండగా అలగనూరు గ్రామంలోని చౌరస్తాలో పోలీసులు తన వాహనాన్ని ఆపి అరెస్టు చేశారు. అక్కడనుండి తనను ఖమ్మం జైలుకు తరలించారు. కేసీఆర్ జైల్లోనే తన ఆమరణ దీక్ష ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం పిలుపును అందుకున్న తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, కళాకారులు, కవులు, ఉద్యోగులు, రైతులు , సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారని గుర్తు చేశారు.
కళాకారులు, ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సకల జనుల తోటి తీవరూపం దాల్చింది. 11 రోజులపాటు కేసీఆర్ ఆమరణ దీక్ష చేయడంతో తన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ కి తరలించడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ నిరసనలు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి చూసిన అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం హోం మంత్రి పి చిదంబరం తోటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత కేసీఆర్ నిమ్స్ ఆస్పత్రిలో నిమ్మరసం తీసుకొని దీక్షను వివరింప చేశారు. అందువల్ల నవంబర్ 29 ఒక ప్రత్యేకమైన తెలంగాణ ఏర్పాటుకు చారిత్రాత్మక ఘట్టమమైంది.
మలిదశ ఉద్యమానికి ఊపిరినిచ్చిన గడ్డ..
అందువల్ల దీక్ష దివస్ తెలంగాణ వ్యాప్తంగా ఆనాటి ఉద్యమ ఉద్యమకారులు చేసిన త్యాగాలు వారి పోరాటాలు ఈ రాష్ట్ర ఏర్పాటుకు చారిత్రాత్మకమైన ఘట్టం కాబట్టి బీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ శ్రేణులు ప్రతి సంవత్సరం నవంబర్ 29ని దీక్ష దివస్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శివుని పెళ్లి స్టేషన్ ఘన్పూర్ జంట నగరాల ఉద్యమ నాయకులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమానికి ఊపిరినిచ్చిన స్టేషన్ ఘన్పూర్ గడ్డ ముఖ్య భూమిక పోషించిందని రంగారావు అన్నారు. నాటి రైతాంగ సాయుధ పోరాటానికి ముఖ్య భూమిక పోషించిన చరిత్ర ఈ స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉందన్నారు.
అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన చరిత్ర స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉంది. ఈ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి అదేవిధంగా డాక్టర్ రాజయ్య, ఆరూర్ రమేష్ ఈ నియోజకవర్గ నుండి తెలంగాణ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించారు . 2011 సంవత్సరంలో డాక్టర్ రాజయ్య కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే రాజీనామా చేయడం అనేది తెలంగాణ ఉద్యమానికి ఎంతో ముఖ్యమైన ఘట్టం. అదేవిధంగా 2012లో తెలంగాణ ఉద్యమ నాయకుల కార్యకర్తలతో ఎంతో కష్టపడి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమానికి ఊపిరి పోసినట్లయింది.
డాక్టర్ రాజయ్య ఉపఎన్నిక గెలవడం ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి ఎంతో ఉపయోగపడ్డాది అన్నారు. అదేవిధంగా ఈనెల 29వ తారీఖున స్టేషన్ ఘన్పూర్ లో దీక్ష దివస్ ప్రోగ్రాం ఉంటుంది. దీనికి బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమకారులందరూ పాల్గొనాలని కోరుతున్నానన్నారు.
Read Also :
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | బీఆర్ఎస్ శ్రేణులంతా దీక్షా దివస్‌లో పాల్గొనాలి.. సీనియర్ నాయకుడు పార్సి రంగారావు పిలుపు
Special Trains | సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు : దక్షిణ మధ్య రైల్వే
‘ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
రేపు ఈఎంసి పరిధిలో దీక్షా దివస్ వేడుకలు
జలసిరి పనులు పరిశీలించిన డీఆర్డీఏ ఏపీడీ రమణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

