అందంగా కనబడాలని ఏ క్రీమ్ పడితే అది వాడుతున్నారా.. ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోండి
Beauty Tips | చర్మం నిగారింపుతో మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఆ మక్కువకొద్దీ మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు వాడతారు. కానీ, సౌందర్యాన్ని కోరుకునేవారంతా ముందుగా చేయాల్సిన పని.. చర్మానికి అవసరమయ్యే విటమిన్లు ఏమిటన్నది తెలుసుకోవడం. ఆయా విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉత్పత్తులనే ఉపయోగించాలి.
మొటిమలు
శరీరంపై మొటిమలు రాకుండా విటమిన్-ఎ ఉపకరిస్తుంది. ముఖ చర్మంపై శరీరం విడుదల చేసే నూనెలను ఇది నియంత్రిస్తుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు విటమిన్-ఎ చాలా మేలు చేస్తుంది. విటమిన్-ఎ లభించే క్రీములు వాడుతూ పాల పదార్థాలు, చేపలు, ముదురు రంగు పండ్లు, కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి.
ముడతలు
రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్-సి నిండుగా ఉన్న పండ్లు, కూరగాయలు తినాలని నిపుణులు చెబుతారు. అందువల్ల 3-10 శాతం విటమిన్-సి ఉన్న క్రీములు పూస్తే చర్మంపై ముడతలు తగ్గుతాయి. ముందునుంచే వాడుతూ ఉంటే.. అసలు రాకుండా జాగ్రత్తపడవచ్చు. ఎండవల్ల కలిగే సమస్యలకూ విటమిన్-సి అడ్డుకట్ట వేస్తుంది. విటమిన్-సి జోడించిన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడతాయి.
పొడి చర్మం
చర్మం పొడిబారడం, గరుకుగా ఉండటం, పెచ్చులు ఊడటం.. మొదలైన సమస్యలు ఉన్నప్పుడు విటమిన్-ఇ చక్కని పరిష్కారం. విటమిన్-ఇ లభించే సన్‌స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లను వాడితే చర్మం పొడిబారదు.
దురద-తామర
చర్మ సమస్యలైన తామర, సోరియాసిస్‌తో బాధపడేవారికి విటమిన్-డి ఉన్న పైపూతలు ఉపశమనం కలిగిస్తాయి. క్రమం తప్పకుండా వాడితే మంట, దురద తగ్గిపోతాయి.
నల్లటి వలయాలు
కళ్ల చుట్టూ నల్లటి వలయాలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటివాళ్లు విటమిన్-కె ఉన్న ఐ క్రీములు వాడితే సమస్య దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read More :
“పాదాలు అందంగా కనిపించాలా? అయితే గ్రీన్ టీతో ఇలా చేసి చూడండి”
“Beauty Tips | అందమైన పెదవుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి”
“madhuri dixit beauty secret | తన అందం వెనుక సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్”
“Dark circles | కళ్ల కింద చారాలా? ఇలా చేయండి ఫలితం మీరే చూడండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- Face
- skin
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

