Green Leafy Vegetables | రోజూ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు. శరీరానికి తగినంత పోషణ లభిస్తుంది. ఏ ఆకుకూరల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీరే చదవండి..
బచ్చలి కూర: శరీరంలో వేడి తగ్గుతుంది. ఎండాకాలంలో మంచిది.
తోటకూర: ఈ ఆకులలో యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ బారినుంచి కాపాడుతుంది. అనేక పోషకాలు లభిస్తాయి.
గోంగూర: గుండెకు బలం చేకూరుస్తుంది. దంత సమస్యలు, కడుపులో పురుగులు వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది.
పుదీనా: రక్తం శుద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నేరుగా నమిలి తినవచ్చు. దీనివల్ల నోటి సమస్యలు, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
మెంతికూర: ముత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది
పొన్నగంటి కూర: కంటిచూపును మెరుగుపరుస్తుంది. చలువ చేస్తుంది.
కొత్తిమీర: ఆస్తమాతో బాధపడేవారికి కొత్తిమీర ఎంతగానో మేలుచేస్తుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
Cellulite | మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధికి.. ఆముదానికి సంబంధమేంటి?”