Cellulite | మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధికి.. ఆముదానికి సంబంధమేంటి?
cellulite | ‘సెల్యులైట్..’ అంటేనే మహిళలు వణికిపోతారు. ఆ సమస్య బారినపడితే ధైర్యంగా బయటికి వెళ్లలేరు. మోకాలి నుంచి తుంటి వరకూ చర్మం గుంతలు పడిపోతుంది. నల్లటి చారలు ఏర్పడతాయి. లేజర్ చికిత్స అందుబాటులో ఉన్నా.. దుష్ప్రభావాల భయం. జీవనశైలి మార్పులూ పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. వీరికి ఆముదమే చక్కని పరిష్కారమని అంటున్నారు వైద్యనిపుణులు.
కారణాలేమిటి?
చర్మపు పొర కింద కొవ్వు కణాలు పేరుకు పోవడం వల్ల సెల్యులైట్ ఏర్పడుతుంది. ఫలితంగా చర్మం నల్లటి చారలతో ఇబ్బందికరంగా మారుతుంది. శోషరస పారుదల వ్యవస్థ (లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్) శరీరంలో నెమ్మదించినప్పుడు రక్తం నుంచి కణాలకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. చర్మం కింద కొవ్వు కణాలు పేరుకుపోతాయి. దీంతో చర్మం ఉబ్బిపోతుంది. యుక్త వయసు తర్వాత మహిళలలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది.
ఆముదమే ఔషధంగా
ఆముదం నూనె ( castor oil )తో సెల్యులైట్‌ను వదిలించుకోవచ్చని చెబుతారు వైద్యులు. వివిధ కొవ్వు ఆమ్లాలతో సమృద్ధమైన ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మానికి పోషణ కూడా అందిస్తుంది. శోషరస పారుదల వ్యవస్థ బలహీనమైనప్పుడు ఆముదంతో మసాజ్ చేస్తే.. లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపడి రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. చర్మం ఎగుడుదిగుడుగా ఉన్నచోట ఆముదం రాసి, బొటనవేలితో మసాజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు సంప్రదాయ వైద్యులు. లావెండర్ ఆయిల్, లెమన్ ఆయిల్‌లను జోడిస్తే.. ఆముదం నూనె మరింత సమర్థంగా పనిచేస్తుంది.
Read More :
“కూరలు, చారుల్లో ధనియాల పొడిని వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Health benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

