న్యూఢిల్లీ : అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందించే సూపర్ సీడ్స్గా చియా సీడ్స్ ఆదరణ పొందుతున్నాయి. ప్లాంట్ ఆధారిత ప్రొటీన్‌కు చియా గింజలను మించినవి లేకపోవడంతో శాకాహారులు వీటిని అమితంగా ఇష్టపడుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా వీటిని సులభంగా డైట్లో భాగం చేసుకోవచ్చు.
శాకాహారుల ప్రొటీన్ అవసరాలను తీర్చడంలో చియా గింజలు ముందుటాయి. 28 గ్రాముల చియా సీడ్స్‌లో 5.6 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. శరీరానికి కావలసిన ప్రొటీన్‌ను చియా సీడ్స్ అందిస్తాయి. దీనికి తోడు ఎముకలు, కండరాల పటిష్టం, ఎదుగుదలకు ఇవి తిరుగులేని ఔషధంగా పనిచేస్తాయి. చియా సీడ్స్‌లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటంతో బ్రెయిన్ హెల్త్‌కు విశేషంగా పనిచేస్తాయి.
చియా సీడ్స్‌ను మితంగా తింటే కడుపునిండిన భావన కలిగి బరువు నియంత్రణలో ఉండేందుకు దోహదపడతాయి. 28 గ్రాముల చియా సీడ్స్‌లో 11.2 గ్రాముల ఫైబర్ ఉండటంతో జీర్ణ ప్రక్రియ సజావుగా సాగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది మెటబాలిజం మెరుగుదలకు, జీర్ణవ్యవస్ధ సజావుగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది.