మెంతులు చేసే మేలు అంతింత కాదయా.. మధుమేహ రోగులకు లాభాలు మెండయా..!
Fenugreek seeds: మెంతులు చేసే మేలు అంతింత కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు అవి ఔషధంలా పనిచేస్తాయి. పచ్చి చేపలు సహా పలు వంటల్లో మెంతులను సువాసన కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే, వాటి ప్రయోజనం

హైదరాబాద్: మెంతులు చేసే మేలు అంతింత కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు అవి ఔషధంలా పనిచేస్తాయి. పచ్చి చేపలు సహా పలు వంటల్లో మెంతులను సువాసన కోసం కూడా ఉపయోగిస్తారు. అయితే, వాటి ప్రయోజనం అంతటికే పరిమితం కాదు, వాటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఈ మెంతులను వివిధ రూపాల్లో తీసుకోవడం ద్వారా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మరి మెంతులలో దాగి ఉన్న ఆ ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..?
ఆరోగ్య ప్రయోజనాలు..
- మెంతులు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో బాగా పనిచేస్తాయి. అదేవిధంగా అజీర్తి, కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు నిత్యం మెంతులు తీసుకోవడం చాలా మంచిది.
- ఇక మెంతుల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దాంతో మనం మోతాదుకు మించిన ఆహారం తీసుకునే ప్రమాదం ఉండదు. దానివల్ల ఒంట్లో కొవ్వు కరుగుతుంది. మధుమేహం అదుపులో ఉంటుంది. కాబట్టి స్థూలకాయులకు, షుగర్ రోగులకు మెంతులు నిత్యావసరం.
- రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజలను నీళ్లలో నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇలా చేయడంవల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.
- అదేవిధంగా మెంతి గింజలను పెనం మీద వేయించి, మెత్తగా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉదయాన్నే ఆ పొడిని వేడి నీటిలో కలుపుకుని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
- అలాగే ఒక చెంచా మెంతులను రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడంవల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. అదేవిధంగా విరేచనాలు తగ్గడానికి కూడా మెంతులు ఉపయోగపడుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

