కూరలు, చారుల్లో ధనియాల పొడిని వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా!!
Coriander Powder Health Tips | వేడి వేడి చారులో ధనియాల పొడి కలిస్తేనే రుచి. గుత్తొంకాయ ఘుమాయించాలంటే ధనియాల మోత మోగాల్సిందే! ఒక్కమాటలో చెప్పాలంటే ధనియాలు గానీ, ధనియాల పొడి గానీ వాడని వంటకం లేదంటే అతిశయోక్తి కాదు. పరిమళభరితమైన కొత్తిమీర పుట్టేదీ ధనియాల నుంచే. మసాలా దినుసుగా వంటింటికే పరిమితమైనా, ఆయుర్వేదంలో మాత్రం ఘన మూలికగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
› ధనియాల్లో విటమిన్ ఎ, కె, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి శరీరానికి, జుట్టుకు, ఇతర ముఖ్యమైన అవయవాలకు మేలు చేస్తాయి.
› ఉబ్బరం, అజీర్తి, విరేచనాలు, వికారం వంటి పేగు సంబంధిత సమస్యలన్నిటినీ ధనియాలు నియంత్రిస్తాయి. జీర్ణ సంబంధిత బాధల నుంచి విముక్తి కలిగిస్తాయి. డైటరీ ఫైబర్, యాంటిఆక్సిడెంట్లు ధనియాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.
› ధనియాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సాయపడతాయి. వీటిలోని రాగి, జింక్, ఐరన్ ఇతర ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
› ధనియాలను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలో చక్కెరస్థాయులు నియంత్రణలో ఉంటాయి. అలాగే అధిక బరువును తగ్గించడంలోనూ సహకరిస్తాయి. ఉదయాన్నే టీకి బదులుగా ధనియాల తేనీరు తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
› చర్మ సంరక్షణకు ధనియాలు సరైన పరిష్కారం. వయసు పైబడిన లక్షణాలను తగ్గించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అలెర్జీల నుంచి శరీరాన్ని కాపాడతాయి.
› రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
› ధనియాలను ఆహారంలో భాగం చేసుకుంటే పార్కిన్సన్స్,అల్జీమర్స్ వంటి రుగ్మతలు దరిచేరవు. మెదడు ఆరోగ్యాన్నికాపాడటంతోపాటు కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి.
› ధనియాలు కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. పలు రకాల టాక్సిన్స్, హానికర సూక్ష్మజీవులను బయటికి పంపడానికి సాయపడతాయి.
Read More :
రాత్రుళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా.. ఒకసారి ఇలా చేసి చూడండి..”
“డయాబెటిస్ ఉన్నవారు దొండకాయ తినొచ్చా?”
Kashmiri Garlic | మన వెల్లుల్లికి కశ్మీరీ వెల్లుల్లికి తేడా ఏంటి? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

