Potato | ఆలుగడ్డ తింటే ఊబకాయం వస్తుందా?
Potato Health Benefits | ఆలుగడ్డలను చాలామంది ఇష్టపడతారు. కానీ ఎక్కువగా తినాలంటే భయపడతారు. వీటివల్ల ఊబకాయం వస్తుందని ఓ ప్రచారం. ఆలుగడ్డలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే అయినా.. సరైన పద్ధతిలో తింటే ఇబ్బంది లేదు.
♦ ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్-సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా అధికమే. విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఈ విటమిన్ వల్ల సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గిపోయి చక్కగా నిద్ర పడుతుంది.
♦ ఆలుగడ్డల్లో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీంతో పెద్దపేగు వాపులు, క్యాన్సర్, అల్సర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
♦ ఆలుగడ్డలలోని ప్రొటినేజ్ ఇన్హిబిటర్ 2 (పీఐ2) అనే ప్రొటీన్ ఆకలిని నియంత్రిస్తుంది. అందువల్ల ఆలుగడ్డలను కొద్దిమొత్తంలో తిన్నా చాలు ఎక్కువసేపు ఆకలివేయదు. ఫలితంగా తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
♦ ఆలుగడ్డలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని నివారిస్తాయి. శరీరానికి సరిపడా పొటాషియం అందకపోతే సోడియం స్థాయులు పడిపోతాయి. దానివల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాంటి సమయంలో.. పొటాషియం ఎక్కువగా ఉండే ఆలుగడ్డలను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆలూలోని ఐరన్, క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తాయి.
♦ ఆలుగడ్డ సౌందర్య పోషణలోనూ ఉపయోగపడుతుంది. ఆలుగడ్డ జ్యూస్ లేదా ముక్కలతో ముఖానికి మసాజ్ చేస్తే నల్లమచ్చలు, ముడతలు తగ్గుతాయి.
♦ ఊబకాయం, ఎసిడిటీ, మధుమేహం, కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఆలుగడ్డలను తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. అందులోనూ ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ రూపంలో కాకుండా పొట్టుతోపాటు ఉడికించిన ఆలూ ఆరోగ్యానికి ఎంతో మేలు.
Read More :
Beetroot | రక్తహీనతతో బాధపడే వాళ్లు బీట్రూట్ తినొచ్చా?”
“Papaya | బాలింతలు బొప్పాయి తింటే ఏమవుతుంది?”
“Watermelon | రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా”
T-Kitchen | గులాబ్ జామూన్‌తో బజ్జీలు కూడా చేస్తారని మీకు తెలుసా?”
“మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? అయితే ఈ ఆకు కూర తినండి”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
AP News | ఏపీలోని 23 లోకల్ బాడీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల..!
‘రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే అగ్రి షో’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

