Papaya | బాలింతలు బొప్పాయి తింటే ఏమవుతుంది?
Papaya Health Benefits | మధుమేహ రోగులతోపాటు.. అందరూ తినదగిన పండు బొప్పాయి. ఇందులో పోషక విలువలు అపారం. బొప్పాయి ఆకు, గింజ, పండు, కాయ.. అన్నీ విలువైనవే.
పోషకాలెన్నో
ఏడాదంతా దొరికే పండు ఇది. ఇందులో విటమిన్-ఎ,బి,సి,ఇ మాత్రమే కాదు.. మెగ్నీషియం, పొటాషియం, ఫొలేట్, లినోలియెక్ యాసిడ్, ఆంథాసిన్లు, బీటా కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్స్, డైటరీ ఫైబర్స్… లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే బొప్పాయి అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. గాయాలను తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు కళ్లకు, జుట్టుకు మేలుచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు దరిచేరకుండా చేస్తుంది.
కాయ మంచిదే
బాలింతలకు పాలు సమృద్ధిగా వచ్చేందుకు పచ్చి బొప్పాయి కాయ కూరను వడ్డిస్తారు. ఇందులో పీచు పదార్థాలు, శక్తి ఎక్కువ. బీటా కెరోటిన్లుగా పిలిచే వర్ణద్రవ్యాలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు అయిన లైకోపీన్లూ అధికమే.

ఆకులు ఆరోగ్యకరం
బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా, నెలసరి నొప్పులు, చర్మ వ్యాధులు, గుండెమంట, కేశ సమస్యలు, మధుమేహం, హైపర్‌టెన్షన్ పరిష్కారానికి సిఫారసు చేస్తారు.
గింజలూ..
బొప్పాయి గింజల్లో భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, క్యాల్షియం, పీచు, సంతృప్త కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అపారం. కాలేయ సమస్యలను, వివిధ క్యాన్సర్లను ఈ విత్తనాలు నివారిస్తాయి.
ఎండబెట్టినా మెండే
బొప్పాయిని కోసి, ఎండబెట్టి నిల్వ చేస్తారు. వీటిలోనూ మినరల్స్, విటమిన్లు అపారం. కానీ కాలేయ, చర్మ రోగాలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి పడకపోవచ్చు. నిపుణులను సంప్రదించాకే తినాలి.
Read More :
“Beetroot | రక్తహీనతతో బాధపడే వాళ్లు బీట్రూట్ తినొచ్చా?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

