Beetroot Health benefits | బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. దీనిలోని ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. రోజూవారీ ఆహారంలో బీట్రూట్ను చేర్చుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. రక్తపోటును నివారించడంలోనూ బీట్రూట్ సాయపడుతుంది. రక్తాన్ని బాగా శుద్ధిచేస్తుంది.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని అదుపులో ఉంచుతాయి. జీర్ణక్రియ సక్రమంగా జరగడంలోనూ బీట్రూట్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.
బీట్రూట్లో పుష్కలంగా లభించే విటమిన్-బి చర్మం, గోళ్లు, వెంట్రుకల పోషణలో సాయపడుతుంది.
బీట్రూట్లోని నైట్రేట్ రక్తప్రసరణ వేగాన్ని పెంచి రక్తనాళాల్లో గడ్డలను నివారిస్తుంది. అందుకే బీట్రూట్ రసం తాగిన మూడు గంటల్లో రక్తపోటులో గణనీయమైన తేడా వస్తుందని నిపుణులు చెబుతారు.
బీట్రూట్ను సలాడ్స్, స్నాక్స్.. ఇలా ఏదో ఒకరూపంలో తీసుకోవచ్చు. పచ్చిగా తింటేనే దీనిలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి.
మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? అయితే ఈ ఆకు కూర తినండి”
ఈ గింజలను తక్కువ అంచనా వేయకండి.. ఇవి తింటే ఎన్ని లాభాలో..!”
Health Tips | స్టార్ ఫ్రూట్ తింటే కలిగే లాభాల గురించి శిల్పా శెట్టి ఏం చెప్పిందంటే..”
మెంతులు చేసే మేలు అంతింత కాదయా.. మధుమేహ రోగులకు లాభాలు మెండయా..!”