మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? అయితే ఈ ఆకు కూర తినండి
పరిచయం : గంగవాయిలి కూర ( Gangavalli kura )
ఆరోగ్యానికి ఆకుకూరలు చేసే మంచి గురించి చెప్పేదేముంది? కాబట్టే, వారానికి రెండుసార్లయినా ఆకుకూరలు తింటారు. కొందరైతే సలాడ్స్‌లో రోజూ తీసుకుంటారు. కాకపోతే పాలకూర, తోటకూరలాంటివే విరివిగా కనిపిస్తాయి. వాటితోపాటు గంగవాయిలి కూరను కూడా చేర్చుకోవచ్చు. దీనిని మామిడికాయతో కలిపి చేసే పప్పు మహాద్భుతం. గంగవాయిలి కూరలో పోషకాలు గంపగుత్తగా ఉన్నాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.
ఇందులోని విటమిన్-ఎ నేత్ర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. ఆరోగ్యకరమైన కణ విభజనకు దన్నుగా నిలుస్తుంది. ఇక, విటమిన్-సి శరీరంలో కొల్లాజెన్, రక్తనాళాలను మంచి స్థితిలో ఉంచడానికి, గాయాలను నయం చేయడానికి సహకరిస్తుంది. గంగవాయిలిలో బీటా కెరోటిన్ అధికం. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్యను తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఎముకలకు అవసరమైన క్యాల్షియం, మెగ్నీషియం కూడా అధికమే. అందువల్ల ఎముకల దృఢత్వానికి ఇది తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ఎముకల సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు, ఈ ఆకుకూరలో ఉండే ఒమెగా-3 ఆమ్లాలు గుండెపోటు తదితర హృద్రోగాలను నివారిస్తాయి.
నగెట్స్@22
ఆరోగ్యం కోసం జనం డైట్ మీద శ్రద్ధ పెడుతున్నారు. అయినా, రోగాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదని ఎంతోమంది బాధపడిపోతున్నారు. కానీ, ఆ మహిళ మాత్రం.. రకరకాల ప్రయోగాలు చేయకుండా ముప్పూటలా చికెన్ నగెట్స్తో హాయిగా బతికేస్తున్నది. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌లో ఉండే సమెర్ మెన్రో 22 ఏండ్లుగా చికెన్ నగెట్స్ మాత్రమే తింటున్నది. అంతేకాదు, ఇన్నేండ్లలో ఏనాడూ అనారోగ్యం బారినపడలేదు. సరిగ్గా మూడో ఏడాది నుంచి తను ‘నగెట్సాహారి’గా మారింది. అయితే, ఈ అలవాటు అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒకే రకమైన ఆహారం తినడం కూడా ఒక జబ్బేనట. అవాయిడెంట్ రిస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్‌టేక్ డిజార్డర్ (ఏఆర్ఎఫ్ఐడి) ఉన్నవాళ్లు ఇలా చేస్తారట.
Read More :
Health Tips | సమ్మర్ హీట్‌ను ఈ డ్రింక్స్‌తో బీట్ చేద్దాం..!
Weight Loss | ఈ రెండింటిని తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు
Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ సమ్మర్లో పుచ్చ కాయ తినొచ్చా?
Dark Circles | కంటి కింద వలయాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Health
- Health benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
Endometriosis | ఎండోమెట్రియోసిస్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి..
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

