న్యూఢిల్లీ : మండు వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు తగినన్ని నీళ్లు తీసుకోవడంతో పాటు శరీరానికి హాని చేసే చక్కెరతో కూడిన పానీయాలకు దూరంగా ఉండటం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారినపడకుండా వడదెబ్బకు గురికాకుండా ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలు తరచూ తీసుకోవాలని చెబుతున్నారు. సోడాలు, చక్కెర కలిపిన పానీయాలకు బదులు ప్రత్యామ్నాయ డ్రింక్‌లు మేలైనవని సూచిస్తున్నారు. వేసవి వేడిమిని తట్టుకునేందుకు ఐదు రకాల ఆరోగ్యకర పానీయాలను తీసుకోవాలని స్పష్టం చేశారు.
బరువు తగ్గడంతో పాటు చెమట రూపంలో కోల్పోయిన పోషకాలను తిరిగి పొందేందుకు కొబ్బరి నీళ్లు ఉపకరిస్తాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో ఎలక్ట్రోలైట్లు కోల్పోకుండా అదనపు కిలోలు తగ్గాలనుకునేవారికి ఈ పానీయం మేలైనది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫైబర్, సోడియం వంటివి పుష్కలంగా ఉండే కొబ్బరి నీళ్లను వేసవిలో తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ కాకుండా ఉండటంతో పాటు బరువు తగ్గడం, మెరుగైన రక్తసరఫరా, ఇమ్యూనిటీ పెరగడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇక సమ్మర్ హీట్‌ను దిగువన పేర్కొన్న డ్రింక్స్‌తో బీట్ చేయవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కొబ్బరినీళ్లు
గ్రీన్ మ్యాంగో జ్యూస్
బటర్ మిల్క్
లస్సీ
లెమన్ వాటర్