Shilpa Shetty Health Tips | నటి శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఆహారం, వ్యాయామానికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. అలా ఈమధ్య స్టార్ ఫ్రూట్స్‌ను చెట్ల నుంచి తెంపుతూ, వాటివల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్న వీడియోను షేర్ చేసింది. “స్టార్ ఫ్రూట్‌ను హిందీలో కారంబోలా లేదా కమ్రఖ్ అంటారు. ఇందులో విటమిన్-సి పుష్కలం. వీటిని తినడంవల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఈ పండ్లను ముక్కలుగా తరిగి, వాటిపై కొద్దిగా సైంధవ లవణం (పింక్ సాల్ట్) చల్లుకుని తింటే అదిరిపోతుంది” అని చెప్పింది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఈ పండ్లకు దూరంగా ఉండటం మంచిదని కూడా హెచ్చరించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
“Golden milk: పసుపుపాలు..ఆరోగ్యానికి ఎంతో మేలు..!!”
రోజూ ఈ పండు తిన్నారంటే మలబద్ధకం సమస్య మటుమాయం..!”
మతిమరుపుతో సతమతమవుతున్నారా.. అయితే ఈ నల్ల క్యారెట్లు తినాల్సిందే..!”