మతిమరుపుతో సతమతమవుతున్నారా.. అయితే ఈ నల్ల క్యారెట్లు తినాల్సిందే..!
Black carrots: క్యారెట్లు సాధారణంగా ఎరుపు, కాషారంగులో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక రకం క్యారెట్లు మాత్రం నల్లగా ఉంటాయి. ఈ నల్ల క్యారెట్లను

హైదరాబాద్: క్యారెట్లు సాధారణంగా ఎరుపు, కాషారంగులో ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఒక రకం క్యారెట్లు మాత్రం నల్లగా ఉంటాయి. ఈ నల్ల క్యారెట్లను చాలామంది చూసి ఉండరు. ఇవి చాలా తక్కువగా కనిపిస్తాయి. వీటినే కాలా గాజర్లు అంటారు. ఈ కాలా గాజర్లు కొన్ని బాగా నల్లగా, కొన్ని మాత్రం బీట్రూట్ రంగులో కనిపిస్తాయి. అయితే, కాషాయం రంగు క్యారెట్లతో పోల్చితే ఈ నల్ల క్యారెట్లతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రుచికి మాత్రం ఇవి అంతతీయగా ఉండవు. మరి ఈ నల్ల క్యారెట్లతో కలిగే ఆ ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..?
ప్రయోజనాలు ఇవే..
- నల్ల క్యారెట్లలో ఆంథోసయనిన్ అనే పదార్థం ఉండటంవల్ల వాటికి ఆ రంగు వస్తుంది. ఈ ఆంథోసయనినే మన శరీరానికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని అందజేస్తుంది.
- ఆరెంజ్ క్యారెట్లలో మాదిరిగానే నల్ల క్యారెట్లలోనూ బీటాకెరాటిన్ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటి కణాలకు రక్షణ కల్పిస్తుంది.
- నల్ల క్యారెట్లలో పీచుపదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు తోడ్పడుతాయి. నల్ల క్యారెట్లు తినడంవల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడమేగాక ఒంట్లో కొవ్వు కూడా తగ్గుతుంది.
- వయసుమళ్లిన వారిలో చాలామందిని రుమటాయిడ్ ఆర్ధరైటిస్ సమస్య వేధిస్తుంటుంది. నల్ల క్యారెట్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఈ సమస్యకు మంచి పరిష్కారం చూపుతాయి.
- కొంతమందిలో వయసుతోపాటే మతిమరుపు సమస్య పెరుగుతుంది. అలాంటివారు నల్ల క్యారెట్లను తినడం అలవాటు చేసుకుంటే పరిష్కారం లభిస్తుంది. నల్ల క్యారెట్లు అల్జీమర్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.
గమనిక: అయితే, ఈ నల్ల క్యారెట్లను అతిగా తింటే అలర్జీలు, రక్తపోటులో హెచ్చుతగ్గుల లాంటి సమస్యలు వస్తాయి. రోజుకి ఒకటి, రెండు క్యారెట్లకు మించకుండా తింటే మాత్రం ఏ సమస్యా ఉండదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

