Health Tips | అప్పట్లో బంగారం కంటే ఖరీదైన ఔషధం ఇది..దాల్చిన చెక్కతో మధుమేహం, రక్తపోటు, అజీర్ణానికి చెక్!
ఒకప్పుడు బంగారం కంటే అధిక ధర పలికిన దాల్చినచెక్క అప్పట్లో కరెన్సీగానూ ట్రేడయింది. ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన స్పైస్‌గా చరిత్రకెక్కింది.
ఒకప్పుడు బంగారం కంటే అధిక ధర పలికిన దాల్చినచెక్క అప్పట్లో కరెన్సీగానూ ట్రేడయింది. ప్రతి ఇంట్లో ఉండే మసాలా దినుసు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంలో అత్యధిక రాబడిని రాబట్టిన స్పైస్‌గా చరిత్రకెక్కింది. భారత్‌లో వంటకాలతో పాటు ఆయుర్వేద మందుల తయారీలోనూ దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగిస్తారు. కాఫీ, టీల్లోనూ వాడే దాల్చిన చెక్క ఘాటైన వాసనతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని హార్వర్డ్ హెల్త్‌లో డాక్టర్ ఉమా నాయుడు రాసుకొచ్చారు.
లవంగాలు వంటి ఇతర మసాలా దినుసులతో పాటు దాల్చిన చెక్కతో మెరుగైన జ్ఞాపక శక్తి, ఒత్తడి మటుమాయం కావడంతో పాటు నిద్రలేమి సమస్యను నివారించడం ఇతర ప్రయోజనాలు చేకూరుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. దాల్చిన చెక్కను నిత్యం వాడటంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఇది యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఔషధంగా అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
దాల్చిన చెక్కతో మధుమేహం నియంత్రణలో ఉండటంతో పాటు ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుందని పార్క్‌వే ఈస్ట్ ఆస్పత్రికి చెందిన పోషకాహార నిపుణులు జెన్నిఫర్ షిమ్ వెల్లడించారు. దాల్చిన చెక్క జీర్ణ వ్యవస్ధలో వాపు ప్రక్రియను నిరోధిస్తుందని పరిశోధనల్లో తేలింది. రక్తపోటును కూడా దాల్చిన చెక్క తగ్గిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దాల్చిన చెక్కతో మెదడు ఆరోగ్యం మెరుగవుతుందని న్యూట్రిషనల్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలిపింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- new study
- Research
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

