Watermelon | రోజూ పుచ్చకాయ తినడం మంచిదేనా
Watermelon Health benefits | ఎండకాలం అంటే గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండకాలంలో వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉండటం వల్ల ఎండ వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. శరీరంలో వాటర్ లెవల్స్‌తో పాటు షుగర్ లెవల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు దోహదపడతాయి. మిగిలిన 8 శాతంలోనూ విటమిన్ ఏ, బీ1, బీ6, స2, పొటాషియం, మెగ్నీషియం, బయోటిన్, కాపర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
పుచ్చకాయ తింటే కలిగే ప్రయోజనాలు
– పుచ్చకాయ రోజూ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
– కొన్ని రకాల కేన్సర్ వ్యాధులను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది.
– పుచ్చకాయలో ఉండే విటమిన్ సీ.. జుట్టును అందంగా, బలంగా మారుస్తుంది.
– కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఏ.. కళ్ల రెటీనాలో పింగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే వేసవిలో కంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
– కడుపుతో ఉన్న మహిళలు పుచ్చకాయ తినడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.
– కాల్షియం అధికంగా ఉండే పుచ్చకాయ తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాతం వంటి రోగాలు నయమవుతాయి.
– కిడ్నీలో రాళ్లు ఉన్నవారు.. మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుందట.
Read More :
Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి”
“డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!”
Health Tips | సమ్మర్ హీట్‌ను ఈ డ్రింక్స్‌తో బీట్ చేద్దాం..!”
Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ సమ్మర్లో పుచ్చ కాయ తినొచ్చా?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

