Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి
Food Storage Tips | ఎండాకాలం వచ్చిందంటే చాలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం కష్టమైపోతుంది. వండిన పదార్థాలేమో ఇట్టే పాడవుతాయి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వడలిపోతాయి. పాలు, పెరుగు సంగతైతే చెప్పక్కర్లేదు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే మండే ఎండల్లోనూ ఆహార పదార్థాలను తాజాగా ఉంచవచ్చు.
♦ మిగతా రోజులతో పోలిస్తే.. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను తగ్గించి 5 డిగ్రీల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. తాజా గుడ్లు, మాంసాన్ని తప్పకుండా ఫ్రిజ్లోనే నిల్వచేయాలి. బ్యాక్టీరియా చేరకుండా ఉండాలంటే వండిన పదార్థాలను, పచ్చి కూరగాయలను వేరువేరు అరల్లో సర్దుకోవాలి.
♦ దూరప్రయాణాలు చేయాల్సి వస్తే ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. వీలైతే కూల్ కంటైనర్‌లో పెట్టడం మంచిది.
♦ పాలు, పులుసులు, కూరలు వంటి వాటిని కొద్ది గంటల వ్యవధితో తరచుగా వేడి చేస్తూ ఉండాలి. కాస్త వేడి కాగానే దించేయకుండా మరుగు వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచాలి.
♦ పెరుగు పులిసిపోకుండా ఉండాలంటే ఫ్రిజ్లోనే నిలువ చేయాలి. ఫ్రిజ్‌లో ఇరుకిరుకుగా డబ్బాలు పెట్టకూడదు. గాలి ఆడేందుకు ఖాళీ వదలాలి. అప్పుడే అందులోని పదార్థాలు పాడవకుండా ఉంటాయి.
♦ ఫ్రిజ్‌లోంచి తీసిన పదార్థాలను వెంటనే కాకుండా, కాసేపటి తర్వాత వండుకోవాలి.
♦ వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను తరిగాక, గాలి చొరబడని డబ్బాల్లో భద్రపరచడం ఉత్తమం.
Read More :
“నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..”
Healty Food | ఈ ఫుడ్ తింటే పదేండ్లు అధికంగా బతకొచ్చు!!”
“Summer Food | సమ్మర్లో ఈ ఫుడ్ తింటే ఏమవుతుందో తెలుసా”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

