నత్తగుల్లలు లొట్టలేసుకుంటూ తింటానంటున్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ ఇష్టమైన ఫుడ్ ఏంటంటే..
Pooja Hegde favorite Food | పూజా హెగ్డే భోజన ప్రియురాలు. సౌందర్యానికి భోజనప్రియత్వం అడ్డుకాదని చెబుతున్నది పూజ. అందం, ఆరోగ్యం గురించి తను చాలా శ్రద్ధ తీసుకుంటుందట. ‘నేను ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వను. ఆచరించేదే చెప్తాను’ అంటున్నది ముక్కుసూటిగా .

దినచర్య ఇలా మొదలు..
ఉదయం వర్కవుట్స్‌కు ముందు కాఫీ తాగుతాను.
ఎక్కువగా తినే ఆహారం
మాంసాహారం అంటే ఎక్కువ ఇష్టం. కడుపులో తేలికగా ఉండటానికి కూరగాయలు కూడా తీసుకుంటాను.

బ్రేక్ ఫాస్ట్
ఎక్కువగా గుడ్లు, అప్పుడప్పుడూ ఎగ్ పరాటా తీసుకుంటాను. భోజనంలోకి ఆమ్లెట్.
పండ్లు
పండ్లన్నీ ఇష్టమే. రోజూ అన్ని రకాల ఫలాలూ తింటాను.

మధ్యాహ్న భోజనానికి ముందు
ఉదయం 11 గంటల సమయంలో కొన్ని పండ్లు తింటాను. లేకపోతే మిల్క్‌షేక్ తాగుతాను.
సాయంత్రం స్నాక్స్
సాండ్విచ్ లేదా ఆలూ టిక్కీ

మదిదోచే వంటకాలు
కొరియన్, ఇండియన్, ఇటాలియన్ రుచులంటే ఇష్టం.
ఇష్టమైన వంటకాలు?
నాకు సీ ఫుడ్ అంటే ప్రాణం. మటన్, చికెన్ ఇష్టమైన వంటకాలు.

చిత్రమైనవి తింటా..
నత్తగుల్లలతో చేసిన వంటకాలు భలే ఇష్టంగా తింటాను. నేను తినేవాటిలో ఇదే కొంచెం విచిత్రమైన తిండి!
చిరుతిండ్లు
భారతీయ పిండివంటలు, గులాబ్‌జామ్, జిలేబీ, కోవా, రబ్డీ మక్కువగా.. ఎక్కువగా తింటాను.

డ్రింక్
నేను హాట్ చాక్లెట్ అభిమానిని. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు హాట్ చాక్లెట్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తాను.
నేనూ వండుతా
పాస్తా, చేపలు, గుడ్లతో కొత్త రుచులు వండుతాను. గుడ్లతో ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం.

సిగ్గుపడేదెప్పుడు?
జంక్ ఫుడ్ తిన్న తర్వాత సిగ్గేస్తుంది.
ఆరోగ్యం కోసం..
జంక్ ఫుడ్, స్వీట్స్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నా. కానీ, ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాను. అప్పుడప్పుడూ జంక్ ఫుడ్, వేపుళ్లు, బర్గర్ లాగిస్తూనే ఉంటాను. ప్రాసెస్
చేసిన ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాను.

ఫిట్నెస్
నేను జన్యుపరంగానే చాలా ఫిట్. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చేస్తాను. ఏది తినాలనిపిస్తే అది తింటాను. తిండి ఎంత ఇష్టమో, వర్కవుట్స్ కూడా అంతే ఇష్టం. జిమ్‌కు వెళ్లాలనిపించకపోతే ఇంట్లోనే తేలికైన యోగాసనాలు వేస్తాను.
బెస్ట్ కుక్
మా అమ్మ. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పగా మా అమ్మే చేస్తుంది! చాలా వేగంగా వండుతుంది. ఎంత కమ్మగా వండుతుందంటే తింటుంటే.. స్వర్గ సుఖాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఉంటుంది.

చిట్కా
తక్కువ తినాలి. ఎక్కువ సార్లు తినాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి తినాలి. క్యాలరీలు తక్కువగా ఉండే డైట్ తీసుకోవాలనే నిబంధన నేను పాటించను. కార్బొహైడ్రేట్స్ మనల్ని మెరిసేలా చేస్తాయి. అందుకే నేను ఎవరికీ కార్బోస్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోమని సలహా ఇవ్వను.
Read More :
బ్లాక్ వాటర్ తాగుతున్న కోహ్లీ, మలైకా అరోరా.. అసలేంటి ఈ నీటి స్పెషాలిటీ..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- diet
- Food
- Pooja hegde
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

