Cupping Therapy | దిశా పటానీ, జాక్వెలిన్.. ఇలా బాలీవుడ్ సెలబ్రెటీలు చేయించుకుంటున్న ఈ ట్రీట్మెంట్ స్పెషాలిటీ ఏంటి?
Cupping Therapy | ఒక కప్పు.. చాయ్ తాగితే తలనొప్పి మాయం! ఒక కప్పు కాఫీ పుచ్చుకుంటే అలసట గాయబ్! ఒక కప్పు పెరుగంటే పోషకాల గనే. నిండు కప్పే కాదు.. కొన్నిసార్లు ఖాళీ కప్పు కూడా సుగుణాల కుప్పే! ‘కప్పింగ్ థెరపీ’తో అనేక రుగ్మతలను పారదోలవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రసాయన ఔషధాల ప్రస్తావనే లేకుండా శరీరంలోని వివిధ సమస్యలకు పరిష్కారం అందించే ప్రాచీన వైద్యం.. కప్పింగ్ థెరపీ లేదా హిజామ! వందల సంవత్సరాల క్రితం కనుమరుగైన ఈ ప్రత్యామ్నాయ వైద్యవిధానం మళ్లీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒంట్లోని కొన్ని కీలక ప్రాంతాలపై గాలి చొరబడని కప్పులను ఉంచి.. ఆయా చోట్ల ఒత్తిడిని సృష్టించడమే ఈ వైద్య విధానం. దీర్ఘకాలిక రుగ్మతలైన బీపీ, షుగర్‌తోపాటు కండరాల సమస్యలు, కీళ్లనొప్పులు, వెన్నెముక వ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు కూడా పరిష్కారాన్ని అందిస్తున్నదీ విధానం. తీవ్రమైన తలనొప్పితో బాధపడేవారికి సత్వర ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకూ కప్పింగ్ థెరపీ ప్రత్యామ్నాయ వైద్యంగా పనిచేస్తుందనడానికి ఆధారాలు ఉన్నాయి. కొద్ది నిమిషాలపాటు సాగే ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక ఫలితాలను పొందవచ్చని చెబుతారు.

ఫైర్ కప్పింగ్..
ఫైర్ కప్పింగ్ అనేది ఈ చికిత్సలో మరో విధానం. మంటతో గాజులో గాలిని తీసేసి శరీరంపై అమర్చుతారు. గాజులోని వేడి వల్ల చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇండొనేషియాలో గాజు కప్పులకు బదులు జంతువుల కొమ్ములను కప్పింగ్ థెరపీలో వాడతారు. కేరళ వైద్య విధానంలోనూ దీనికి ప్రధాన పాత్ర ఉంది. కాకపోతే, కప్పింగ్ థెరపీ చేయించుకుంటే శరీరంపై గాజు కప్పులు అమర్చిన భాగంలో ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. తాత్కాలికంగా నొప్పి ఉంటుంది. అయితే, ఈ ప్రాచీన వైద్యం ఇచ్చే ఫలితాల ముందు ఇలాంటి పరిమితులు చాలా చిన్నవనే అంటారు. మచ్చల నివారణకు ఎటువంటి మందులూ అవసరం లేదు. వారం రోజులపాటు రెండుపూటలా ఆలివ్ ఆయిల్ రాస్తే మచ్చుకైనా లేకుండా పోతాయి మచ్చలు. బాలీవుడ్‌లోనూ ఇదో ట్రెండ్. దిశా పటానీ, ఊర్వశి రౌతేలా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి వెండితెర భామలతోపాటు పలువురు క్రీడాకారులు తమ కప్పింగ్ థెరపీ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకొంటున్నారు. దిశా పఠానీ ఒంటి మీది మచ్చలను చూసి ఫొటోగ్రాఫర్లు ఏదేదో ఊహించుకున్నారు. ‘కట్టుకథలు ఆపండి. నేను కప్పింగ్ థెరపీ తీసుకుంటున్నా’ అంటూ ఆమె వివరణ ఇచ్చాకే పుకార్లు ఆగిపోయాయి. కప్పింగ్ థెరపీ అనేది ఒకటి ఉందన్న విషయమూ జనానికి తెలిసింది.

ఎలా చేస్తారంటే..?
సమస్య ఉన్న శరీర భాగంపై చిన్నచిన్న గాజు కప్పులను అమర్చి.. వాటిలో పూర్తిగా గాలి తీసేస్తారు. దీంతో ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. కప్పులు అమర్చిన చోట రక్తం పేరుకుపోయి ఎర్రగా మారుతుంది. కాసేపటి తర్వాత ఆ ప్రాంతాల్లో బ్లేడుతోగానీ, సూదితోగానీ గాట్లు పెడతారు. శరీరంపై పడే ఒత్తిడివల్ల చెడు రక్తం ఆ రంధ్రాల గుండా కప్పుల్లో చేరుతుంది. క్రమంగా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. ఊబకాయం, థైరాయిడ్ తదితర రుగ్మతలతో పాటు రుతు సంబంధ సమస్యలకూ ఈ వైద్యం చక్కగా పనిచేస్తుందని చెబుతారు. వాపు, దురద, మొటిమలు, ఎలర్జీలు వంటి చర్మసంబంధ సమస్యలకూ కప్పింగ్ థెరపీ చక్కని పరిష్కారమని చెబుతారు. ముఖ సౌందర్యం పెంచుకోవడానికీ ఈ పద్ధతిని వినియోగిస్తారు. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి చర్మానికి నిగారింపు వస్తుంది. ఇందుకు అవసరమైన పరికరాలు ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్నాయి. థెరపీ తర్వాత పుష్కలంగా నీళ్లు తాగాలి. విశ్రాంతి అవసరం. కాకపోతే, ఈ ప్రక్రియ నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి.
Read More :
“బ్లాక్ వాటర్ తాగుతున్న కోహ్లీ, మలైకా అరోరా.. అసలేంటి ఈ నీటి స్పెషాలిటీ..”
అల్పాహారం చేసిన తర్వాత పూజ చేయవచ్చా?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

