floating breakfast | ఈ బ్రేక్ఫాస్ట్ తినాలంటే.. లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఏంటి దీని స్పెషల్.. సెలబ్రెటీలకు ఎందుకు ఇష్టం?

floating breakfast | కరోనా సంక్షోభం కాస్త తగ్గుముఖం పట్టాక.. కుటుంబంతో కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లేందుకు జనం ధైర్యం చేస్తున్నారు. ఎప్పటి నుంచో వేసుకున్న ప్రణాళికలను ఇప్పుడు అమలు చేస్తున్నారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ డెస్టినేషన్ల కోసం టూర్ మేనేజర్లను సంప్రదిస్తున్నారు. ఆ యాత్రా ప్రియులకు ‘ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ ( floating breakfast ) ‘ రుచి చూపుతున్నాయి రిసార్ట్స్ అండ్ విల్లాస్.

ఇప్పటికే బాలీవుడ్ తారలు పూజా హెగ్డే, సారా అలీఖాన్, పరిణీతి చోప్రా, తాప్సీ తరచూ తాము పూల్లో స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తూ..‘ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్’ అనుభూతిని ఆస్వాదిస్తామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో, చాలామంది ఈ కొత్తరకం విందు కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి సదుపాయం ఉందో గూగుల్లో వెతుకుతున్నారు. స్విమ్మింగ్ పూల్ వాతావరణాన్ని ఇష్టపడేవారికి తేలియాడే ఫలహారం తెగ నచ్చుతుంది.

ఉదయాన్నే వెచ్చని సూర్యకిరణాలు ఒంటిమీద పడుతుంటే.. చల్లచల్లని కొలనులో ఈతకొడుతూ బ్రేక్ఫాస్ట్ చేయడం నిజంగా కొత్త అనుభూతే. సోషల్ మీడియాలో కూడా ఫ్లోటింగ్ మీల్స్, ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్ల గురించి పోస్ట్లు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని రిసార్ట్స్ అయితే.. పర్సనలైజ్డ్ పూల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అంటే, ఆ పూల్లో మనం ఒక్కరమే ఉంటాం, మహా అయితే మన కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. కొన్నిచోట్ల బ్రేక్ఫాస్ట్ను ట్రేలలో కాకుండా బుట్టల్లో సరఫరా చేసి ఆకట్టుకుంటున్నారు. సెల్ఫీ ప్రియుల కోసం స్టార్ హోటళ్లు, రిసార్ట్స్ డ్రస్ కోడ్నూ ఎత్తేశాయి. పూల్ బ్యాక్డ్రాప్ అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా చూస్తున్నాయి. మంచి లొకేషన్లలో సెల్ఫీలు దిగి తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు టూరిస్టులు.

దీనివల్ల రిసార్ట్స్కూ ప్రచారమే. బుకింగ్డాట్కామ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. కరోనా తర్వాత, ఫ్లోటింగ్ బ్రేక్ఫాస్ట్లాంటి కొత్త ట్రెండ్స్ పట్ల టూరిస్టులు మరింత ఆసక్తి చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 66 శాతం మంది ప్రత్యేకంగా ప్రైవేట్ పూల్స్ ఉండాలని కోరుతున్నారట. ఇలాంటి ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్స్ బాలి, మాల్దీవులు, శ్రీలంక, థాయ్లాండ్ లాంటిచోట్ల ఎక్కువగా ఉన్నాయి. కందీమా మాల్దీవ్స్ అనే ప్రైవేట్ ఐలాండ్ రిసార్ట్లో కూడా కొత్తగా ఫ్లోటింగ్ లంచ్ అనుభూతిని అందిస్తున్నారు. వెంటనే బుక్ చేసుకోండి మరి!

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్లాక్ వాటర్ తాగుతున్న కోహ్లీ, మలైకా అరోరా.. అసలేంటి ఈ నీటి స్పెషాలిటీ..
Jigelu Rani Maldives Breakfast | ‘జిగేలు రాణి’ మాల్దీవుల్లో ఏం చేస్తుందో చూడండి
most eligible bachelor in OTT | ఓటీటీలోకి వచ్చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్..
Pooja Hegde Call Sheets | పవన్ సినిమా..క్లారిటీ కోసం పూజాహెగ్డే వెయిటింగ్..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

