Pooja Hegde Call Sheets | పవన్ సినిమా..క్లారిటీ కోసం పూజాహెగ్డే వెయిటింగ్..!
తెలుగు, తమిళ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde). పవన్‌కల్యాణ్ నటిస్తోన్న భవదీయుడు భగత్‌సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) చిత్రంలో నటించే అవకాశం కూడా కొట్టేసింది.

తెలుగు, తమిళ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది పూజాహెగ్డే (Pooja Hegde). ఇప్పటికే రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్‌కల్యాణ్ ( Pawan Kalyan ) మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు భవదీయుడు భగత్‌సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) చిత్రంలో నటించే అవకాశం కూడా కొట్టేసింది. ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఈ విషయాన్ని చెప్పాడు.అయితే పవన్‌కల్యాణ్ రాజకీయ పరమైన కారణాలతో ఈ చిత్రం ఆలస్యమవుతూ వస్తోంది.
సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందన్న విషయంలో అనిశ్చితి నెలకొనడంతో పూజాహెగ్డేకు నిర్మాతలు ఇచ్చే పారితోషికాన్ని పెండింగ్‌లో పెట్టారట. దీంతో పూజాహెగ్డే కూడా తన డేట్స్ కేటాయించే విషయంలో క్లారిటీగా లేనట్టు వార్తలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు పూజాహెగ్డే కోసం లైన్లో వేచి ఉన్నా.. కాల్షీట్ల విషయంలో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తుంది పూజాహెగ్డే. ఇక పవన్‌కల్యాణ్ ప్రాజెక్టుకు అధికారికంగా సంతకం చేసే ముందు డైరెక్టర్ హరీష్‌శంకర్ నుంచి స్పష్టత తీసుకోవాలని పూజాహెగ్డే భావిస్తుందట.

ప్రస్తుతం విజయ్‌తో కలిసి బీస్ట్ చిత్రంలో నటిస్తోంది పూజాహెగ్డే. దీంతోపాటు సల్మాన్ ఖాన్ సినిమా, మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలు కూడా పూజాహెగ్డే ఖాతాలో ఉన్నాయి. ఒక వేళ పవన్ సినిమా కోసం కొన్ని నెలలు డేట్స్ అవసరమైతే ఆ షెడ్యూల్ ప్రకారం తన కాల్షీట్లను సర్దుబాటు చేసుకోవాలనే ఆలోచనలో ఉందట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

