Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్

ఆరేళ్ల వయసులో ‘కలాథూర్ కన్నమ్మ’ అనే సినిమాతో బాల నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన కమల్ హాసన్ .. హీరోగా చరిత్రలో గుర్తుండిపోయే చిత్రాలు చేశారు. సకలకళావల్లభుడిగా పేరు ప్రఖ్యాతలు పొందిన కమల్ హాసన్ ఒక్క నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా, హోస్ట్‌గా అలరిస్తూ వస్తున్నాడు. ఈ రోజు కమల్ బర్త్ డే కావడంతో ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “విక్రమ్” నుంచి నిన్ననే ఓ గిఫ్ట్ గా గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో కమల్ ఎంట్రీ కేక పెట్టించింది.
కమల్ బర్త్ డే సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలువురు గిఫ్ట్స్ పంపుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడు వరదలతో బాధ పడుతున్నవారికి, పేద ప్రజలకు సహాయం అందించండి అని ఇదే నా బర్త్ డేకి ఇచ్చే అసలైన గిఫ్ట్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు కమల్ హాసన్.ఆయన ట్వీట్ తర్వాత అభిమానులు భారీగా సాయాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
కమల్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసి మూడేళ్లవుతుంది. చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ చేస్తున్న సినిమా విక్రమ్. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి కమల్‌హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తోన్న 232వ సినిమాలో డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

