పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న సూపర్ హిట్ చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఈ సినిమాను చూసిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందనే కాన్ఫిడెంట్లో వారు ఉన్నారు.
రీసెంట్గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాలా భీమ్లా అనే సాంగ్ వీడియో ప్రోమో ఒకదానిని విడుదల చేసింది. ప్రోమోలో పవన్ కళ్యాణ్ నుదుటిన తిలకంతో.. మందు సీసాతో “నాగరాజు గారు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి.. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది.. హ్యాపీ దీపావళి” అంటూ చెప్పిన డైలాగ్ పవర్ స్టార్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. తాజాగా త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఫుల్ సాంగ్ విడుదల చేశారు.
ఈ సాంగ్లో థమన్ డ్రమ్స్ వాయిస్తుంటే డ్యాన్సర్స్ పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఈ పాట ఫ్యాన్స్కి కూడా పూనకాలు తెప్పిస్తుంది. కొద్ది సేపటి క్రితం విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జంటగా నిత్య మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న భీమ్లా నాయక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ముందుగా ప్రకటించారు.కాని వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు.