తెలుగు, తమిళ, హిందీ దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజాహెగ్డే (Pooja Hegde). ఈ భామ కాల్షీట్ల కోసం ఎదురుచూస్తున్న మేకర్స్ చాలా మందే ఉన్నారు. సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటుంది పూజాహెగ్డే. ఇటీవలే అఖిల్‌తో కలిసి నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) చిత్రంలో తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి..అందరినీ మెస్మరైజ్ చేసింది. ఎప్పుడూ పొట్టి డ్రెస్సుల్లో కనిపించే ఈ పొడుగు కాళ్ల సుందరి ఈ సారి రూటు మార్చింది.
ఇటీవల వరుడు కావలెను ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో కొత్త లుక్‌లో మెరిసింది. రేషమ్ థ్రెడ్, అద్దం, పూసల ఎంబ్రాయిడరీతో డిజైన్ చేయబడ్డ (brown kurta sharara set) బ్రౌన్ కుర్తా, శరారా ప్యాంట్, నెట్ దుపటా డ్రెస్సులో హొయలు పోయింది పూజాహెగ్డే. పెద్ద ఇయర్ రింగ్స్, ఓపెన్ హెయిర్‌తో రాయల్ లుక్‌లో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. ఫెస్టివ్ సీజన్‌కు మ్యాచ్ అయ్యే డ్రెస్‌లో పూజాహెగ్డే తళుక్కుమంటున్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
ప్రస్తుతం పూజాహెగ్డే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్ 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో బీస్ట్ సినిమా చేస్తోంది. దీంతోపాటు హిందీలో సర్కస్, భాయ్‌జాన్ చిత్రాలు చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం