అల్పాహారం చేసిన తర్వాత పూజ చేయవచ్చా?
– విశ్వాస్, హైదరాబాద్
దైవారాధన స్వచ్ఛమైన సంకల్పంతో చేయాల్సింది. ఇంద్రియ నిగ్రహం, ఏకాగ్రతతో పూజలో పాల్గొనాలి. దైవాన్ని త్రికరణ శుద్ధితో వేడుకోవడం కోసం కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకున్నాం. త్రికరణాలు అంటే మనస్సు, వాక్కు, కాయకర్మ. మనసులో దేవుని రూపాన్ని ఆవహించుకొని ప్రార్థించాలి. మాట (వాక్కు)తో వేడుకోవాలి. వాటికి ఆధారమైన శరీరాన్ని ఆ రెండిటితో సమన్వయం చేయాలి. అదే కాయకర్మ. ఆకలి దప్పులు దేహానికి సంబంధించినవే. శరీరం, మనసు రెండూ ఒకదాని పైన ఒకటి పెత్తనం చెలాయిస్తుంటాయి. శరీరం ఏదో వాంఛిస్తూ సమయం, సందర్భం లేకుండా మనసును ఆడిస్తూ ఉంటుంది. అయితే, బుద్ధితో మనసును అదుపు చేసినప్పుడే సాధన సజావుగా కొనసాగుతుంది. పూజకు ముందుగా ఉపాహారం తీసుకోవడం కూడా ఈ కోవలోకే వస్తుంది.
‘శరీరమాద్యం ఖలు ధర్మ సాధనమ్, దేహే సరోగేతు నచార్థ సిధ్ధిః’ అనేది పెద్దలు చెప్పిన మాట. ధార్మిక కార్యాలను నిర్వహించడానికి శరీరం మూలాధారం. శరీరం రోగగ్రస్తమైతే ఏదీ సాధించలేం. ఆకలిని నియంత్రించ గలిగిన శక్తియుక్తులు ఉన్నపుడు నిగ్రహించుకొని ఉపాహారం తీసుకోకుండా దైవారాధన చేయడమే శ్రేష్ఠం. శరీరం సహకరించనప్పుడు, ఔషధాలు తీసుకుంటున్నట్లయితే.. వైద్యులు సూచించిన ఆహార నియమాలు పాటిస్తూ నిత్యపూజ చేసుకోవచ్చు. యజ్ఞ యాగాలు, వ్రతాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు.
– డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Abhishekam |అభిషేకం వేటితో చేస్తే శివుడికి ప్రీతికరం.. పాలతోనా? పెరుగుతోనా?
కాలం ముందు ఆ శివుడు అయినా లోబడి ఉండాల్సిందే.. ఇదే అందుకు నిదర్శనం
అమ్మవారికి నిమ్మకాయల హారం వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !