న్యూఢిల్లీ: కొంత మంది భారతీయ హిందువులను పాకిస్థాన్ వెనక్కి పంపింది. వారు సిక్కులు కాదంటూ పాక్‌లోకి ప్రవేశాన్ని నిరాకరించింది. దీంతో వారంతా నిరాశతో భారత్‌కు తిరిగి వచ్చారు. (Hindus Denied Entry By Pak) సిక్కు మత స్థాపకుడు గురునానక్ 556 జయంతి నేపథ్యంలో జన్మస్థలమైన పాకిస్థాన్ సరిహద్దులోని నంకనా సాహిబ్‌ను సందర్శించేందుకు సుమారు 2,100 మంది భారతీయులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. వీరికి ప్రయాణ అనుమతి పత్రాలను పాకిస్థాన్ జారీ చేసింది.
కాగా, మేలో ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య తర్వాత తొలిసారి 1,900 మంది భారతీయులు మంగళవారం పంజాబ్‌లోని వాఘా సరిహద్దు దాటారు. పాకిస్థాన్‌లోకి వారు ప్రవేశించారు. వీరిలో ఢిల్లీ, లక్నోకు చెందిన 14 మంది హిందువులు కూడా ఉన్నారు.
మరోవైపు పాకిస్థాన్‌లో జన్మించిన సింధీలైన 14 మంది హిందువులు భారత పౌరసత్వం పొందారు. పాకిస్థాన్‌లోని తమ బంధువులను కలిసేందుకు తగిన ప్రతాలతో ఆ దేశంలోకి ప్రవేశించారు. అయితే ‘మీరు సిక్కులు కాదు హిందువులు’ అని పాక్ అధికారులు వారిని అవమానించారు. కేవలం సిక్కులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. భారతీయ హిందువులైన 14 మందిని వెనక్కి పంపారు. దీంతో వారంతా నిరాశతో భారత్‌కు తిరిగి వచ్చారు.
Also Read:
BJP leader missing | బీజేపీ నేత అదృశ్యం.. అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచినట్లు కుటుంబం ఆరోపణ
man kills wife, girlfriend | భార్య, ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాలను ఒకేచోట పడేసిన వ్యక్తి
Watch: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో చంపిన పనిమనిషి.. వీడియో వైరల్