బెంగళూరు: ఒక పనిమనిషి దారుణానికి పాల్పడింది. పెంపుడు కుక్కను లిఫ్ట్ లోపల చంపింది. లిఫ్ట్ నేలకేసి బాది కుక్క ప్రాణం తీసింది. (Domestic Worker Kills Pet Dog) ఆ లిఫ్ట్‌లోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బాగలూరు ప్రాంతంలోని అపార్ట్మెంట్లో నివసించే ఒక కుటుంబం సెప్టెంబర్ 11న పుష్పలతను పనిలో పెట్టుకున్నారు. పెంపుడు కుక్కను చూసుకోవడానికి నెలకు రూ. 23,000 జీతం ఇచ్చేలా ఆమెను పనిలో కుదుర్చుకున్నారు.
కాగా, పనిమనిషి పుష్పలత దారుణానికి పాల్పడింది. అక్టోబర్ 31న రెండు పెంపుడు కుక్కలను లిఫ్ట్‌లోకి తీసుకెళ్లింది. మెడకు స్ట్రిప్ ఉన్న ఒక కుక్క పిల్లను లిఫ్ట్ నేలకేసి కొట్టి చంపింది. మరో కుక్క ఆ లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత చనిపోయిన కుక్కను ఆమె లాక్కెళ్లింది. పెంపుడు కుక్క మరణించినట్లు యజమానికి చెప్పింది.
మరోవైపు ఆ లిఫ్ట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను వారు పరిశీలించారు. దీంతో పనిమనిషి పుష్పలత దారుణంగా పెంపుడు కుక్కను చంపిన సంగతి బయటపడింది. ఆ కుక్క యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతు హింసకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితురాలైన పుష్పలతను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పెంపుడు కుక్కను ఆమె ఎందుకు చంపింది అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Heartless Woman Caught on CCTV Killing Innocent Puppy Inside Lift Humanity at Its Lowest 💔🐾
In a horrifying act of inhumanity, a domestic worker in Bengaluru was caught on CCTV killing a helpless puppy by throwing it inside an apartment lift. The woman, who was trusted and… pic.twitter.com/mFnrpYFVKB
— Karnataka Portfolio (@karnatakaportf) November 3, 2025
Also Read:
Girl Gang-Raped | ట్యూషన్ కోసం వెళ్లిన బాలికపై.. ముగ్గురు సామూహిక అత్యాచారం
Woman Pushed Of Moving Train | కదులుతున్న రైలు నుంచి.. మహిళను బయటకు తోసిన ప్రయాణికుడు
BJP leader missing | బీజేపీ నేత అదృశ్యం.. అక్రమంగా పోలీస్ కస్టడీలో ఉంచినట్లు కుటుంబం ఆరోపణ