కోల్కతా: ట్యూషన్ కోసం ఇంటి నుంచి వెళ్లిన బాలికను ముగ్గురు వ్యక్తులు ఒక ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Girl Gang-Raped) బాధిత బాలిక ఫిర్యాదుతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. డమ్ డమ్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఏడో తరగతి చదువుతున్నది. శనివారం సాయంత్రం ట్యూషన్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.
కాగా, ఒక పార్క్ వద్ద తెలిసిన వ్యక్తిని ఆ బాలిక కలిసింది. మరో ఇద్దరు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. ఆ ముగ్గురు కలిసి ఆ బాలికను బలవంతంగా ఆటోలో మోతీలాల్ కాలనీలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు ఆ రాత్రి వేళ బాలిక అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, సంజు సాహా, విక్కీ పాస్వాన్, రాజేష్ పాస్వాన్ను నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
man kills wife, girlfriend | భార్య, ప్రియురాలిని హత్య చేసి.. మృతదేహాలను ఒకేచోట పడేసిన వ్యక్తి
Woman Pushed Of Moving Train | కదులుతున్న రైలు నుంచి.. మహిళను బయటకు తోసిన ప్రయాణికుడు