చెన్నై: కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఎయిర్పోర్ట్ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులను నిందితుల అరెస్ట్ కోసం బృందాలను ఏర్పాటు చేశారు. (Woman Student Gang-Raped) కేరళలోని కోయంబత్తూరులో ఈ సంఘటన జరిగింది. ఒక యువతి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నది. ఆదివారం రాత్రి స్నేహితుడితో కలిసి కారులో వెళ్లింది.
కాగా, కోయంబత్తూరు ఎయిర్పోర్ట్ సమీపంలో రాత్రి వేళ ఆగి ఉన్న ఆ కారు వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. మగ స్నేహితుడ్ని వారు కొట్టారు. కారులో ఉన్న యువతిని అక్కడి నుంచి లాక్కెళ్లారు. మరో ప్రాంతానికి తరలించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు బాధిత మహిళ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. ఆమెను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. వారి అరెస్ట్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో తమిళనాడులో మహిళలకు భద్రత లోపించిందని డీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది.
Also Read:
Fake Doctors Hub | నకిలీ డాక్టర్లకు అడ్డాగా ఆ జిల్లా.. మూడు నెలల్లో 17 మంది అరెస్ట్
Man Kills Wife | భార్యను హత్య చేసిన వ్యక్తి.. మూడేళ్ల బిడ్డను ఆ గదిలో బంధించి పరార్
Watch: ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్