గువాహతి: ఒక జిల్లా నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది. (Fake Doctors Hub) దీంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. గత రెండు రోజుల్లో ఇద్దరు నకిలీ వైద్యులను అరెస్ట్ చేశారు. గత మూడు నెలల్లో 17 మంది నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది. కాచర్ జిల్లా నకిలీ డాక్టర్ల అడ్డగా మారింది. దీంతో ఈ ఏడాది ఆగస్ట్ నుంచి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
కాగా, డ్వార్బాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోజ్కాండీ టీ ఎస్టేట్‌లో ఉన్న ఫార్మసీలో వైద్యుడిగా వ్యవహరిస్తున్న 41 ఏళ్ల సుపాల్ రాయ్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో ఆపరేషన్‌లో తారాపూర్‌లోని ఈ అండ్ డీ కాలనీలోని మా ఆయుర్వేద్ కేంద్రంలో మరో నకిలీ వైద్యుడైన 39 ఏళ్ల ఇంద్రజిత్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురికి చెందిన అతడు విజిటింగ్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.
మరోవైపు కాచర్ జిల్లాలోని నకిలీ వైద్యులపై తమ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు గత మూడు నెలల్లో 17 మంది నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నకిలీ వైద్యుల గురించి ప్రజల నుంచి సమాచారం కోసం 6026903329 అనే ప్రత్యేక నంబర్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వివరించారు.
Also Read:
Watch: అదుపుతప్పి రౌండ్ తిరిగి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి
Watch: ఉద్దేశపూర్వకంగా బైక్‌ను ఢీకొట్టిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Buffalo Worth Rs.21 Crore Dies | పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల గేదె.. అనారోగ్యంతో మృతి