జైపూర్: పశు ప్రదర్శనలో ఆకట్టుకున్న రూ.21 కోట్ల విలువైన గేదె ఆరోగ్యం క్షీణించింది. దానిని కాపాడేందుకు పశువైద్యులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆ భారీ గేదె మరణించింది. (Buffalo Worth Rs.21 Crore Dies) రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పుష్కర్‌లో ప్రతి ఏటా నిర్వహించే పశు మేళా అక్టోబర్ 30న గ్రాండ్‌గా ప్రారంభమైంది. రూ.21 కోట్ల విలువైన భారీ గేదెతో పాటు ఇతర జంతువులు ఎంతో ఆకట్టుకున్నాయి.
కాగా, అక్టోబర్ 31న పుష్కర్ పశు ప్రదర్శనలో ఉంచిన రూ.21 కోట్ల విలువైన భారీ గేదె ఆరోగ్యం క్షీణించింది. దీంతో పశువైద్యులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. కోట్ల ఖరీదైన ఆ భారీ గేదెకు చికిత్స అందించి కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే దాని భారీ శరీర బరువు, ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఫలితం లేకపోయింది. ఆ భారీ గేదె మరణించింది.
మరోవైపు ఆ గేదె అంత లావుగా కనిపించేందుకు పలు రకాల డ్రగ్స్ ఇచ్చి ఉంటారని పశువైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. పశు జాతరను రోజూ వేల సంఖ్యలో సందర్శించే జనం చనిపోయిన భారీ గేదెను చూసేందుకు ఎగబడ్డారు. ఈ పుష్కర్ పశు మేళా నవంబర్ 5న ముగియనున్నది.
भैंस 🐃 का मालिक 21 करोड़ मांग रहा था इस भैंस 🐃 का…और लोग 9 करोड़ तक देने को तैयार थे लेकिन उसने बेचा नहीं…
और आज उस भैंस 🐃 की मेले में ही मौत हो गई ..
Buffalo 🐃 worth 21 crore dies in Pushkar fair 😐 people were ready to give 9 crore but he didn’t sell it.. pic.twitter.com/egOeEWdzz0— JosD92 (@JosD92official) November 2, 2025
Also Read:
Man Kills Co-Worker | ఆఫీస్‌లో లైట్ ఆర్పే విషయంలో గొడవ.. సహోద్యోగిని హత్య చేసిన వ్యక్తి
Women drown in beach | బీచ్‌లో ఆడుతూ.. సముద్రంలో మునిగి నలుగురు అమ్మాయిలు మృతి
Ambulance Kills Couple | దూసుకొచ్చిన అంబులెన్స్.. స్కూటర్‌పై వెళ్తున్న దంపతులు మృతి