బెంగళూరు: రోడ్డు క్రాసింగ్ వద్ద అంబులెన్స్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసింది. ముందున్న పలు ద్విచక్ర వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఒక స్కూటీని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ఢీకొట్టింది. ఆ స్కూటీపై ప్రయాణించిన భార్యాభర్తలు ఈ ప్రమాదంలో మరణించారు. (Ambulance Kills Couple) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 11 గంటలకు రిచ్మండ్ సర్కిల్ సమీపంలో రెడ్ సిగ్నల్‌ను అంబులెన్స్ క్రాస్ చేసింది. ముందు వెళ్తున్న బైకులపైకి వేగంగా దూసుకెళ్లింది. ఒక స్కూటీని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. చివరకు పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ఢీకొట్టిన తర్వాత ఆ అంబులెన్స్ ఆగింది.
కాగా, అంబులెన్స్, పోలీస్ అవుట్‌పోస్ట్ మధ్య చిక్కుకున్న స్కూటీ నుజ్జునుజ్జు అయ్యింది. పలువురు వాహనదారులు ఆ అంబులెన్స్‌ను పక్కకు నెట్టగా అది బోల్తాపడింది. ఆ స్కూటీపై ప్రయాణించిన భార్యాభర్తలైన 40 ఏళ్ల ఇస్మాయిల్, అతడి భార్య సమీన్ బాను అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A speeding ambulance rammed into 3 bikes near Richmond Circle in Bengaluru last night, two people killed, others injured. The ambulance dragged a bike for nearly 50m before hitting a traffic police booth. Driver absconding; case filed. pic.twitter.com/n35AKSrmWH
— Deepak Bopanna (@dpkBopanna) November 2, 2025
Also Read:
woman kills lover with fiance | కాబోయే భర్తతో కలిసి.. ప్రియుడ్ని చంపిన మహిళ
Watch: రైలులో పర్సు చోరీ.. బాధిత మహిళ ఏం చేసిందంటే?
Watch: స్కూల్‌కు వెళ్లేందుకు నిరాకరించిన బాలుడు.. అతడ్ని ఎలా తీసుకెళ్లారంటే?