న్యూఢిల్లీ: ఒక బాలుడు స్కూల్కు వెళ్లేందుకు నిరాకరించాడు. మంచాన్ని పట్టుకుని దానిని వదలలేదు. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని మంచంతో సహా స్కూల్కు తీసుకెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Kid Refuses To Go To School) ఒక బాలుడు స్కూల్కు వెళ్లబోనని మొండికేశాడు. పడుకున్న మంచాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఎంతకీ దానిని వదలలేదు.
కాగా, ఆ బాలుడ్ని స్కూల్కు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు చాలా కష్టపడ్డారు. ఆ విద్యార్థిని మంచంతో సహా స్కూల్కు తరలించారు. స్కూల్ లోపలకు వెళ్తున్న విద్యార్థులు గేట్ వద్ద అతడ్ని చూసి నవ్వుకున్నారు.
మరోవైపు ఆ బాలుడ్ని మంచం పట్టు నుంచి వదిలించేందుకు ఒక టీచర్ కూడా ప్రయత్నించాడు. అయినప్పటికీ స్కూల్కు వెళ్లబోనన్న మొండిపట్టును అతడు వీడలేదు. అయితే ఇది ఎక్కడ జరిగిందో అన్నది తెలియలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
सांप चारपाई के कैसे लिपट जाता है, वैसे ही यह बालक।
स्कूल नहीं जाने की जिद्द। परिवार के लोग भी होशियार निकले, चारपाई के साथ ही स्कूल उठा लाए। जिद्द में इस बालक ने सारे रिकॉर्ड तोड़ ही दिए होंगे।आप लोगों ने भी स्कूल नहीं जाने के लिए इतनी जिद्द की है, कमेंट में बताओ? pic.twitter.com/GygZfH4VIM
— Arvind Sharma (@sarviind) October 29, 2025
Also Read:
woman gang-raped | మహిళపై మత్తు మందు చల్లి.. ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం
BJP MP Praveen Khandelwal | ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ
Nitish Kumar | ‘నేను నా కుటుంబం కోసం పని చేయలేదు’.. ఎన్నికలకు ముందు నితీశ్ వీడియో సందేశం