భువనేశ్వర్: పని నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళను ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆమె ముఖంపై మత్తు మందు చల్లారు. స్పృహ కోల్పోయిన ఆ మహిళను రోడ్డు పక్కకు లాక్కెళ్లారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (woman gang-raped) బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని సుబర్ణపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీరామహరాజ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో నివసిస్తున్న మహిళ ఒక షోరూమ్‌లో పనిచేస్తున్నది. అక్టోబర్ 30న పని తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నది.
కాగా, ముఖానికి ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆ మహిళను అడ్డుకున్నారు. ఆమె ముఖంపై మత్తు మందు చల్లారు. స్పృహ కోల్పోయిన ఆ మహిళను రోడ్డు పక్కకు లాక్కెళ్లారు. ఆ ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు బాధిత మహిళ మరునాడు బీరామహరాజ్పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరో వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Nitish Kumar | ‘నేను నా కుటుంబం కోసం పని చేయలేదు’.. ఎన్నికలకు ముందు నితీశ్ వీడియో సందేశం
BJP MP Praveen Khandelwal | ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చండి.. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ