భోపాల్: ఒక జంటకు పెళ్లి సంబంధం కుదిరింది. కొన్ని రోజుల్లో నిశ్చితార్థం జరుగనున్నది. అయితే దీనికి ముందు వధువు తండ్రితో వరుడి తల్లి పారిపోయింది. ఇది తెలుసుకుని ఇరు కుటుంబాలు షాక్ అయ్యాయి. (Groom’s Mother Elopes With Bride’s Father) మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిక్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రైతు కొన్నేళ్ల కిందట భార్యను కోల్పోయాడు. ఇద్దరు పిల్లలతో కలిసి అతడు నివసిస్తున్నాడు.
కాగా, ఉంటాసా గ్రామానికి చెందిన కుటుంబంలోని వ్యక్తితో ఆ రైతు కుమార్తెకు పెళ్లి సంబంధం కుదిరింది. నిశ్చితార్థం కోసం ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో బిజీ అయ్యాయి. ఈ సందర్భంగా ఆ రైతు, కాబోయే అల్లుడి తల్లి మధ్య సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో 45 ఏళ్ల మహిళ తన భర్త, మేజర్లు అయిన ఇద్దరు పిల్లలను వదిలి కాబోయే వియ్యంకుడితో కలిసి పారిపోయింది.
మరోవైపు ఆ మహిళ అదృశ్యంపై ఆమె కుటుంబం ఆందోళన చెందింది. తల్లి మిస్సింగ్ గురించి ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేయగా చిక్లి గ్రామంలోని ఆ రైతు వద్ద ఆ మహిళ ఉన్నట్లు వారం రోజుల తర్వాత గురువారం గుర్తించారు.
ఈ విషయం తెలుసుకున్న వరుడి కుటుంబం షాక్ అయ్యింది. ఇంటికి తిరిగి రమ్మని ఆమెను ఒప్పించేందుకు వారు ప్రయత్నించారు. అయితే ఆ రైతుతోనే కలిసి ఉంటానని ఆ మహిళ తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో తెలియక ఇరు కుటుంబాల వారు అయోమయంలో పడ్డారు.
Also Read:
Woman Kills Son With Lover | బీమా డబ్బు కోసం.. ప్రియుడితో కలిసి కుమారుడ్ని హత్య చేసిన మహిళ
Watch: కారును రివర్స్ చేస్తూ మహిళను ఢీకొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్