 
                                                            లక్నో: ఒక వ్యక్తి తన చెల్లిని హత్య చేశాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. పడేసేందుకు బైక్‌పై బయలుదేరాడు. పోలీసులు అతడి బైక్ ఆపారు. మూటలో ఏమున్నదని ప్రశ్నించగా గోధుమలు ఉన్నట్లు అతడు చెప్పాడు. చివరకు తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Man Kills Sister) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. రోడ్డు ప్రాజెక్టు కింద ప్రభుత్వం సేకరించిన భూమికి సంబంధించి చింకు నిషాద్కు రూ.6 లక్షల పరిహారం డబ్బులు అందాయి. 19 ఏళ్ల కుమార్తె నీలం వివాహం వచ్చే ఏడాది జనవరిలో జరుగనున్నది. దీంతో రూ.6 లక్షలు కూతురి పెళ్లి కోసం వినియోగించాలని తండ్రి చింకు నిర్ణయించాడు.
కాగా, ఆ పరిహారం డబ్బులో తనకు వాటా ఇవ్వకపోవడంపై 32 ఏళ్ల కుమారుడు రామ్ ఆశిష్ ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న చెల్లి నీలం గొంతునొక్కి హత్య చేశాడు. ఆమె కాళ్లు విరిచాడు. మృతదేహాన్ని సంచిలో కుక్కాడు. బైక్ వెనుక ఆ సంచిని కట్టాడు. కుషినగర్‌లో పడేసేందుకు బయలుదేరాడు.
మరోవైపు మార్గమధ్యలో రామ్ బైక్‌ను పోలీసులు ఆపారు. బైక్ వెనుక కట్టిన సంచిలో ఏమి ఉన్నదని ప్రశ్నించగా గోధుమలు ఉన్నట్లు చెప్పాడు. ఆ తర్వాత కుషినగర్‌లోని చెరకు తోటలో చెల్లి మృతదేహం ఉన్న సంచిని పడేశాడు.
అయితే నీలం కనిపించకపోవడంతో తండ్రి చింకు ఆందోళన చెందాడు. రామ్ బైక్‌పై ఒక మూట తీసుకెళ్లినట్లు స్థానికులు అతడికి చెప్పారు. ఈ నేపథ్యంలో కుమార్తె అదృశ్యంపై పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. కుమారుడిపై ఆయన అనుమానం వ్యక్తం చేశాడు.
పోలీసులు రామ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పరిహారం డబ్బులో తండ్రి తనకు వాటా ఇవ్వకపోవడంతో చెల్లిని హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీస్ అధికారి తెలిపారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman Kills Son With Lover | బీమా డబ్బు కోసం.. ప్రియుడితో కలిసి కుమారుడ్ని హత్య చేసిన మహిళ
Woman Killed By Daughter’s Friends | ఇంట్లోకి రావద్దన్నందుకు.. మహిళను హత్య చేసిన కూతురి స్నేహితులు
Watch: కారును రివర్స్ చేస్తూ మహిళను ఢీకొట్టిన వ్యక్తి.. వీడియో వైరల్
 
                            