 
                                                            లక్నో: ఒక వ్యక్తి కారును రివర్స్‌లో వేగంగా నడిపాడు. నడుస్తూ వెళ్తున్న మహిళను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా ఆ మహిళను కారుతో అతడు ఢీకొట్టాడా? లేక కారుపై అదుపుకోల్పోయాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. (Man Runs Car Over Woman) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 27న గౌర్ సిటీ 2లోని 16వ అవెన్యూ సొసైటీ పార్కింగ్ వద్ద తెల్లటి కారును డ్రైవర్ అతివేగంగా రివర్స్ చేశాడు. నడుస్తూ వెళ్తున్న మహిళపైకి కారును దూకించాడు.
కాగా, కారు ఢీకొట్టడంతో ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆ మహిళ రెండు కాళ్ళు విరిగినట్లు తెలుస్తున్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మహిళను కారుతో ఢీకొట్టాడా? లేక కారుపై నియంత్రణ కోల్పోయాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#GreaterNoida 🚨⚠️ Disturbing Visuals
West Gaur City, 16th Avenue Society
Speeding while Reversing the Car at closed parking area? Lady’s leg injuries…
Pay attention while on Wheels!#DriveSlow @DriveSmart_IN @dabir @InfraEye
pic.twitter.com/bHeh5jkNt4— Dave (Road Safety: City & Highways) (@motordave2) October 30, 2025
Also Read:
Watch: క్రేన్ ఆపరేటర్ చెంపపై కొట్టిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్
Woman Kills Son With Lover | బీమా డబ్బు కోసం.. ప్రియుడితో కలిసి కుమారుడ్ని హత్య చేసిన మహిళ
Ayurvedic syrup | ఆయుర్వేద సిరప్ తాగి.. ఆరు నెలల చిన్నారి మృతి
Woman Killed By Daughter’s Friends | ఇంట్లోకి రావద్దన్నందుకు.. మహిళను హత్య చేసిన కూతురి స్నేహితులు
 
                            