మయాంక్ శతకం.. నబీ జోరుతో కర్ణాటక టాపార్డర్ కుదేలు
రంజీ ట్రోఫీ ఫైనల్లో బ్యాట్‌తో భారీ స్కోరు చేసిన జమ్మూకశ్మీర్ బంతితోనూ అదరగొడుతున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ అకిబ్ నబీ (3/32) పేస్ జోరుకు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక మూడో రోజు తడబడింది.
హుబ్లీ: రంజీ ట్రోఫీ ఫైనల్లో బ్యాట్‌తో భారీ స్కోరు చేసిన జమ్మూకశ్మీర్ బంతితోనూ అదరగొడుతున్నది. ఆ జట్టు స్టార్ పేసర్ అకిబ్ నబీ (3/32) పేస్ జోరుకు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక మూడో రోజు తడబడింది. నబీ ధాటికి 57 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (207 బంతుల్లో 130 నాటౌట్, 17 ఫోర్లు) ఆదుకున్నాడు. మయాంక్ పోరాటానికి శ్రేయాస్ గోపాల్ (27), కృతిక్ కృష్ణ (27 నాటౌట్) తలో చేయి వేయడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 69 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 220 రన్స్ చేసింది.
టీమ్ఇండియాకు ఆడే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (13)ను ఔట్ చేసి కర్ణాటకకు తొలి షాకిచ్చిన నబీ.. 18వ ఓవర్లో కరుణ్ నాయర్, స్మరణ్ రవిచంద్రన్‌ను డకౌట్ చేశాడు. ఈ క్రమంలో మయాంక్.. గోపాల్, కృతిక్‌తో కలిసి ఆ జట్టును ఒడ్డున పడేసే యత్నం చేస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇంకా 364 పరుగులు వెనుకబడే ఉంది. అంతకుముందు జమ్మూకశ్మీర్ మొదటి ఇన్నింగ్స్‌లో 584 రన్స్‌కు ఆలౌట్ అయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

