 
                                                            భోపాల్: ఆయుర్వేద సిరప్ తాగి ఆరు నెలల చిన్నారి మరణించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయుర్వేద సిరప్ అమ్మిన షాపును సీజ్ చేశారు. దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశారు. (Ayurvedic syrup) విషపూరిత దగ్గు మందు తాగి 24 మంది పిల్లలు మరణించిన మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆరు నెలల వయస్సున్న రోహి మినోటేకు వారం కిందట జర్వం, జలుబు వచ్చింది. ఆ పాప తల్లిదండ్రులు డాక్టర్‌కు చూపించలేదు. స్థానిక మెడికల్ స్టోర్‌లో ఆయుర్వేద దగ్గు సిరప్ కొనుగోలు చేశారు. ఆ చిన్నారికి ఆ మందు తాగించారు.
కాగా, నాలుగు రోజుల తర్వాత ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ పాప మరణించింది. ఈ నేపథ్యంలో ఆయుర్వేద దగ్గు సిరప్, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తమ కుమార్తె చనిపోయినట్లు ఆ కుటుంబం ఆరోపించింది.
మరోవైపు ఈ సంఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రగ్ ఇన్స్పెక్టర్, బ్లాక్ మెడికల్ ఆఫీసర్, మరో అధికారితో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తునకు ఆదేశించారు. ఆయుర్వేద సిరప్ అమ్మిన మెడికల్ స్టోర్‌కు తాత్కాలికంగా సీలు వేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Killed By Daughter’s Friends | ఇంట్లోకి రావద్దన్నందుకు.. మహిళను హత్య చేసిన కూతురి స్నేహితులు
Watch: బాలిక పైనుంచి కారు నడిపిన మైనర్ బాలుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఛత్ ప్రసాదం కోసం.. ప్యాసింజర్ రైలు ఆపిన లోకో పైలట్, వీడియో వైరల్
 
                            