పాట్నా: ఉత్తరాదిలో ఛత్ పూజలు, ఆచారాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్ ప్రసాదం కోసం ప్యాసింజర్ రైలును లోకో పైలట్ ఆపాడు. ఒక వ్యక్తి నుంచి ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Driver Stops Passenger Train) అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన బీహార్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని ముఖ్య పండుగల్లో ఛత్ పూజ ఒకటి. ఈ నేపథ్యంలో భక్తులు నది వద్ద పూజలు ఆచరించారు. అక్కడున్న వారికి ప్రసాదాలు పంపిణీ చేశారు.
కాగా, ఆ ప్రాంతంలో ఉన్న రైలు పట్టాలపై ప్యాసింజర్ రైలు వెళ్తున్నది. ఛత్ ప్రసాదాల పంపిణీని లోకోపైలట్ గమనించాడు. వంతెన సమీపంలో ఆ రైలును నిలిపివేశాడు. ఒక వ్యక్తి నుంచి ఛత్ ప్రసాదాన్ని స్వీకరించాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇదే నిజమైన సనాతన ధర్మమని ఒకరు పేర్కొన్నారు. అయితే భారత్లో మాత్రమే ఇలాంటివి జరుగుతాయని మరొకరు వ్యాఖ్యానించారు.
ट्रेन रुकी थी तो ड्राइवर साहब को भी छठ पूजा का प्रसाद दिया गया ❤️✨ pic.twitter.com/pl8HFiQPHy
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) October 28, 2025
Also Read:
Farmer Attempts Suicide | ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారన్న భయంతో.. బెంగాల్ రైతు ఆత్మహత్యాయత్నం