లక్నో: ఒక మహిళ ప్రియుడ్ని ఆమె కుటుంబ సభ్యులు కొట్టి చంపారు. (Lover Beaten To Death) ఇది తెలుసుకున్న ఆమె గొంతు కోసుకున్నది. మహిళ ప్రియుడ్ని హత్య చేసిన భయంతో ఆమె బంధువు కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల రవి, పర్చాచా గ్రామానికి చెందిన 18 ఏళ్ల మనీషా ప్రేమించుకున్నారు. వారిద్దరూ గతంలో ఒకసారి ఇళ్ల నుంచి పారిపోయారు
కాగా, మనీషాకు మరో వ్యక్తితో పెళ్లి చేసేందుకు ఆమె కుటుంబం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న రవి ఆమె గ్రామానికి వెళ్లాడు. అతడ్ని చూసి మనీషా కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. రవిని కట్టేసి దారుణంగా కొట్టి చంపారు. అతడు చనిపోయినట్లు గ్రహించిన మనీషా మేనమామ అయిన 35 ఏళ్ల పింటు హత్య కేసు గురించి ఆందోళన చెందాడు. కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. రవితోపాటు పింటూను మౌదాహాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం పింటూను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే రవినే కత్తితో పింటూను పొడిచినట్లు అతడి కుటుంబం ఆరోపించింది.
కాగా, ప్రియుడు రవి మరణించినట్లు తెలుసుకున్న మనీషా కూడా ఆందోళన చెందింది. కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెను కూడా జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మనీషా, ఆమె బంధువైన పింటూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ మూడు సంఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Fake Scientist | నకిలీ బార్క్ సైంటిస్ట్ అరెస్ట్.. కీలక అణు సమాచారం లీక్ చేసినట్లు అనుమానం
Watch: ఆన్లైన్లో అమ్మాయిని వేధించిన వ్యక్తి.. ఆమె స్నేహితులు ఏం చేశారంటే?