చెన్నై: ఒక వ్యక్తి ఆన్లైన్లో అమ్మాయిని వేధించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి ఆమె చెప్పింది. ఆ వ్యక్తిని అతడు హెచ్చరించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. ఫేక్ ఐడీతో చాట్ చేసి అతడ్ని రప్పించారు. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ దోచుకున్నారు. (fake robbery to avenge) తమిళనాడులోని సేలంలో ఈ సంఘటన జరిగింది. చెన్నైకి చెందిన బ్రాహ్మణయాగం అనే వ్యక్తికి ఆన్లైన్ గేమింగ్ యాప్‌లో మైనర్ బాలిక పరిచయమైంది.
కాగా, అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ అకౌంట్ తెరిచాడు. ఆ బాలికను ఆన్లైన్లో వేధించాడు. దీంతో స్నేహితుడైన రామకృష్ణన్‌కు ఈ విషయాన్ని ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణయాగంను అతడు హెచ్చరించాడు. వేధింపులు ఆపకపోవడంతో తన స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు.
మరోవైపు రామకృష్ణన్, అతడి స్నేహితులు కలిసి సోషల్ మీడియాలో ఫేక్ ఐడీతో అకౌంట్ క్రియేట్ చేశారు. బ్రాహ్మణయాగంతో చాట్ చేశారు. తెలివిగా అతడ్ని సేలం రప్పించారు. అక్కడి వంతెన వద్ద అతడ్ని అడ్డుకున్నారు. దొంగల మాదిరిగా నటించారు. బ్రాహ్మణయాగం మొబైల్ ఫోన్ లాక్కున్నారు. బైక్‌పై అక్కడి నుంచి పారిపోయారు. బాలికను వేధించిన చాటింగ్‌లు ఉన్న ఆ మొబైల్ ఫోన్‌ను వారు ధ్వంసం చేశారు.
అయితే ఆ రోడ్డుపై వెళ్తున్న ఒకరు దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేశారు. బ్రాహ్మణయాగం నుంచి మొబైల్ ఫోన్ దోచుకున్న రామకృష్ణన్, అతడి ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.
కాగా, అది నిజమైన దోపిడీ కాదని, ప్రతీకారమని పోలీసులు తెలుసుకున్నారు. బాలికను వేధించిన చాటింగ్‌లు ఉన్న బ్రాహ్మణయాగం మొబైల్ ఫోన్ చోరీ కోసం వారు ఈ ప్లాన్ వేశారని పోలీస్ అధికారి తెలిపారు. ధ్వంసం చేసిన ఆ మొబైల్ ఫోన్లోని స్క్రీన్ షాట్లను గుర్తించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
பாலத்தின் மீது நடந்து சென்ற நபரிடம் பட்டப்பகலில் வழிப்பறியில் ஈடுபட்ட இளைஞர்கள்… வெளியான அதிர்ச்சி காட்சிகள்..!#Salem | #Bridge | #ViralVideo | #Robbery | #PolimerNews pic.twitter.com/rRHYy4QrnQ
— Polimer News (@polimernews) October 25, 2025
Also Read:
Woman’s Body In Auto | రోడ్డు పక్కనున్న ఆటోలో మహిళ మృతదేహం.. గుర్తించిన స్థానికులు
Man Beaten To Death | వివాహేతర సంబంధం కారణంగా.. వ్యక్తిని కట్టేసి కొట్టి చంపారు
Watch: బైక్ స్టంట్‌లో బీటెక్ విద్యార్థి మృతి.. స్కిడ్ కావడంతో ఎగసిన నిప్పురవ్వలు