బెంగళూరు: ఒక వ్యక్తికి మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలం కలిసి జీవించిన ఆమె తన పుట్టింటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ప్రియుడ్ని ఆ మహిళ కుటుంబ సభ్యులు కట్టేసి కొట్టి చంపారు. (Man Beaten To Death) కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా గౌనగావ్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల విష్ణు తన తల్లితో కలిసి బీదర్‌లోని చింతకి గ్రామంలో నివసిస్తున్నాడు. పెళ్లై, పిల్లలున్న పూజతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భర్తను వీడిన ఆమె విష్ణుతో కలిసి కొంతకాలం జీవించింది.
కాగా, మూడు నెలల కిందట పూజా నాగనపల్లిలోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెను కలిసేందుకు విష్ణు మరో ఇద్దరితో కలిసి అక్టోబర్ 21న ఆ గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ హనుమాన్ ఆలయంలో ఉండగా పూజ తండ్రి అశోక్, ఆమె సోదరుడు గజానన్ కలిసి విష్ణును అడ్డుకున్నారు. అతడ్ని గుడి నుంచి బయటకు లాక్కొచ్చి ఒక స్తంభానికి కట్టారు. ఆ తర్వాత కర్రలతో దారుణంగా కొట్టారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన విష్ణును తొలుత చింతకి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత బీదర్‌లోని బ్రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
విష్ణు తల్లి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన పూజ తండ్రి అశోక్, ఆమె సోదరుడు గజానన్ను అరెస్ట్ చేశారు. అయితే వారిద్దరూ విష్ణును కర్రలతో దారుణంగా కొట్టిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Karnataka: A disturbing incident has come to light in Bidar where a young man Vishnu, originally from Maharashtra, was tied to a pole and beaten up by the family of a woman (Pooja) who he was allegedly in a relationship with. The incident was reported on 21 October.
The family… pic.twitter.com/Agb9GOGB29
— South First (@TheSouthfirst) October 26, 2025
Also Read:
Dengue cases | మణిపూర్‌లో డెంగ్యూ విజృంభన.. 3,300 దాటిన కేసులు
Watch: బైక్ స్టంట్‌లో బీటెక్ విద్యార్థి మృతి.. స్కిడ్ కావడంతో ఎగసిన నిప్పురవ్వలు