మణిపూర్: మణిపూర్‌లో డెంగ్యూ విజృంభిస్తున్నది. అక్టోబర్ 25 నాటికి ఆ రాష్ట్రవ్యాప్తంగా 3,334 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇంఫాల్ వెస్ట్‌లో అత్యధికంగా 2,323 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంఫాల్ తూర్పులో మొత్తం 608 కేసులు నమోదయ్యాయి. (Dengue cases) మణిపూర్‌లో గత 24 గంటల్లో 69 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టరేట్ తెలిపింది. ఇంఫాల్ వెస్ట్‌లో కొత్తగా 38 కేసులు, ఇంఫాల్ తూర్పులో 21 కొత్త కేసులను గుర్తించినట్లు పేర్కొంది.
కాగా, మణిపూర్‌లోని అన్ని జిల్లాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బిష్ణుపూర్‌లో 96, తౌబాల్‌లో 74, సేనాపతిలో 61, కాక్చింగ్ జిల్లాలో 45 డెంగ్యూ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఉఖ్రుల్, చందేల్, తమెంగ్లాంగ్, టెంగ్నౌపాల్, కామ్జోంగ్, నోనీ, కాంగ్పోక్పి, చురచంద్‌పూర్ జిల్లాల్లో 50 కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు.
మరోవైపు జిరిబామ్, ఫెర్జావల్లో ఎలాంటి డెంగ్యూ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బిష్ణుపూర్ జిల్లాలో డెంగ్యూ వల్ల ఒకరు మరణించినట్లు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వివరించారు.
Also Read:
Watch: బైక్ స్టంట్‌లో బీటెక్ విద్యార్థి మృతి.. స్కిడ్ కావడంతో ఎగసిన నిప్పురవ్వలు
Watch: మహిళ మొబైల్ ఫోన్ నేలకు విసిరికొట్టి.. ఆమె చెంపపై కొట్టిన పోలీస్